జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. సోనియాగాంధీకి ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం సంతోషకరమైన విషయమని 10 ఏళ్లుగా కెసిఆర్ చేసిన అరాచకాలు దౌర్జన్యాలు ప్రజలు బుద్ధి చెప్పి బిఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దె దించి ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం శుభ సూచకమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మహిళలకు వృద్ధులకు విద్యార్థులకు యువకులకు ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ,మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *