జాతీయ స్ఫూర్తిని కలిగించడమే మేరా మాటి – మేరా దేశ్ లక్ష్యం : వడ్డేపల్లి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 01 : ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని కలిగించడమే మేరా మాటి – మేరా దేశ్ లక్ష్యమని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మేరా మట్టి – మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సిద్దివినాయక, శ్రీ దుర్గామల్లేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టి సేకరణ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్మీ జవాన్ భాస్కర్ చేత మట్టి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేరా మట్టి – మేరా దేశ్ కార్యక్రమంతో దేశ భక్తి పెరుగుతుందని, అమరుల పట్ల గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల గౌరవం, భక్తి కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ పులిగోల్ల శ్రీలక్ష్మి, ఒబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు పులిగోల్ల, శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయకుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి బొంత హరికృష్ణ, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ, బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గంగాపుత్ర, శ్రవణ్ కుమార్, సాయి, భాను, శివ, దినేష్ సింగ్, రామ్మోహన్, సాయి చంద్, జనరల్ సెక్రెటరీ అంకిత్, మహదేవ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *