జాతీయ ఐక్యత అవార్డుకు ఎంపికైన భక్త్ రామ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఈనెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం, జాతి ఐక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి ఇచ్చే జాతీయ ఐక్యత అవార్డు 2023ను ప్రముఖ ఆర్య సమాజ్ నాయకుడు సామాజిక సేవకుడు భక్త్ రామ్ ను ఎంపిక చేసినట్టు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మిర్ దొడ్డి డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుల్తాన్ బజార్ లోని ఆర్య కన్య విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ట్రిబ్యునల్ కోర్ట్స్ చైర్మన్ న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు దేశ్పాండే ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డు ప్రదానం చేస్తారని తెలిపారు. ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *