జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికినివాళులు అర్పించిన ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహా

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : మీర్ఖాన్ పేటలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహా ముదిరాజ్ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా,అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.నాడు గాంధీ సుదీర్ఘమైన నాయకత్వం వల్ల దేశం నలుమూలలా జాతీయవాదం పటిష్టమై అన్ని వర్గాల ప్రజలు,మహిళలు,కార్మికులు స్వచ్ఛందంగా ఆంగ్లేయులపై పోరాడడానికి ముందుకొచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాకి రాములు,చిర్ర సాయిలు,చంద్రశేఖర్ గుప్తా,గుద్దేటి వెంకటయ్య గుప్తా,కాకి రవి,బొమ్మరాజు జంగయ్య,కాకి చిన్న నరసింహ,గండు నరసింహ,శ్రీనాథ్ రెడ్డి,నాగరాజుచారి,గ్రామ యువకులు,పెద్దలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *