జహంగీర్ పీర్ దర్గాలో “వీర్లపల్లి శంకర్” ప్రతేకంగా పూజలు 

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 19: షాద్ నగర్ నియోజక వర్గంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గాను గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హజరత్ జహంగీర్ బాబా బురన్ బాబాలకు తమ మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో బాబాను దర్శించుకుని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రార్థనలు నిర్వహించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు.దర్గా పర్యటన సందర్భంగా వీర్లపల్లి శంకర్ పలువురు గిరిజనులను ప్రత్యేకంగా కలుసుకున్నారు. గిరిజనుల ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి జిల్లా చైర్మన్ ఆగిరి రవికుమార్ గుప్తా గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్ కోరరవి గణేష్ తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మహిళలు పెద్ద ఎత్తున కృషి చేయాలని కాంగ్రెస్ హయాంలోని మైనార్టీలకు సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని శంకర్ ఈ సందర్భంగా చెప్పారు. తనపై విశ్వాసం ఉంచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి బాబర్ ఖాన్ ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, నందిగామ ఎంపీటీసీ కుమార్ గౌడ్,  రవి, అర్జున్ లక్ష్మణ్, శ్రీనాథ్, బుచ్చన్న, మంకాల శ్రీశైలం, అశోక్, శ్రీహరి గౌడ్, శీను నాయక్, రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్ తదితరులు హాజరయ్యారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *