జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేసిన ఈటెల

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : లతామా ఫౌండేషన్ సౌజన్యంతో యూనియన్ సభ్యులకు గురువారం బుద్ధ భవన్ లో గల తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉచిత పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా ఎన్.యూ.జె.ఐ జాతీయ అధ్యక్షుడు రస్ బిహారి ప్రారంభించగా 200 మందికి పైగా టీజేఏ యూనియన్ సభ్యులు పోస్టల్ ఇన్సూరెన్స్ ని పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నాయకులు ఈటల రాజేందర్ పాల్గొని యూనియన్ సబ్యులకు పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్వ సభ్యులు, టీజేఏ ముఖ్య సలహాదారు ఉప్పల లక్ష్మణ్, టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు కెవి.రమణారావుల సమక్షంలో అందజేశారు. జూమ్ ద్వారా పాల్గొన్న ఎన్.యు.జె.ఐ జాతీయ అధ్యక్షులు రసబిహారి యూనియన్ సబ్యులకు టీజేఏ గుర్తింపు కార్డులను తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ముఖ్య సలహాదారు ఉప్పల లక్ష్మణ్, టీజేఏ రాష్ట్ర నాయకులు కెవి.రమణారావు తదితరుల చేతుల మీదుగా అందజేశారు. తపాలాశాఖ సూపరిండెంట్ తమ సిబ్బందితో యూనియన్ సబ్యులకు పోస్టల్ ఇన్సూరెన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు రాజలింగం, ఘోరి, సంపత్, ఖలీల్, యూసుఫుద్దీన్ ఖాద్రి, నసీరుద్దీన్ ఖాద్రి, అబ్దుల్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *