వారికి ప్రాణాల కన్నా
దేశ రక్షణ ప్రాధాన్యం
తమ కుటుంబాల కన్నా
శాంతి భద్రతలు ప్రధమం
వ్యక్తిగత శ్రేయస్సు కన్నా
జాతి యోగక్షేమ ముఖ్యం
వారు లేక దేశము లేదు
దేశం లేక మనము లేము
వాళ్లే మన వీర సైనికులు
భారత సాయుధ దళాలు
మాతృదేశ రక్షణ కోసం
ప్రాణాలను లెక్కచేయక
బార్డర్లో పహారా కాస్తారు
నిద్రాహారాలను త్యజించి
ఎండ వాన చలిని భరించి
కదంతొక్కి కవాతుజేస్తారు
తూటాల వర్షం కురిసినా
ఫిరంగి నిప్పులు చిమ్మినా
వెరవక ధైర్య సాహసంతో
శత్రు మూకలను కడతేర్చి
జాతీయ జెండా ఎగరేస్తారు
ఊపిరి దీపం ఆరుతున్నా
జైహింద్ అంటూ నినదిస్తూ
అమరత్వం అద్దుకుంటారు
మాతృదేశ రక్షణ కోసం
జీవితాన్ని అంకితమిచ్చే
ఆ అమరధీరుల స్మరిద్దాం
ఆ త్యాగధనుల స్తుతిద్దాం
ఆ సమర సేనల శ్లాఘిద్దాం
జయహో…భారత సైన్యమా
విజయహో..త్రివర్ణ పతాకమా!!
(డిసెంబర్ 7 న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493




