టిఆర్‌ఎస్ నుండి ఆరుగురు మంత్రులను తీసుకున్నప్పుడు జయశంకర్ చెప్పినప్పటికీ ఒక్క బీసీ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వక పోయినప్పుడు
అసంతృప్తి వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ఏకైక లక్ష్యంగా అనేక అవమానాలు అటుపోట్లను
శివుడు కాలకూట విశం మింగినట్లుగా ఆచార్య జయశంకర్ అనుభవించినారు.
జయశంకర్ మరణించి 12 సంవత్సరాలు గడుస్తున్నది.
తెలంగాణ వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది.
నీళ్లు నిధులు నియామకాలు ఒక్క కుటుంబానికి వర్గానికి మాత్రమే చెందిన వని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన స్వయంపాలన సామాజిక న్యాయం ఆత్మగౌరవం గడీలో బంధించబడినదని, ఓటర్లను యాచకులుగా తయారు చేస్తున్నాడని, ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పొర్లుదండాలు పెట్టే స్థాయికి తెలంగాణ ఆత్మగౌరవం దిగజారిందని ఉద్యమకారులు నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలం నాటి లిబాంచెన్ కాల్మొక్తాలి లాంటి దుర్మార్గపు విష సంస్కృతికి తెలంగాణ రాష్ట్రంలో పునర్జీవం పోయడం చూస్తే జయశంకర్ సారు మరో సామాజిక ఉద్యమానికి సిద్ధమయ్యేవారు కావచ్చు.
తెలంగాణలో విద్య బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో లేదని ప్రతి సమావేశంలో చెప్పేవారు.
రాష్ట్రం వచ్చినా విద్య పేద వర్గాలకు అందని ద్రాక్ష పండ్లే అయింది. లిఅన్న వస్త్రము అడిగబోతే ఉన్న వస్త్రము గుంజుకున్నట్లయిందిలి తెలంగాణ పేద వర్గాల పరిస్థితి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ చుట్టుప్రక్కల వలస నాయకుల అభివృద్ధి మాత్రమే అని ఆవేదన చెందేవాడు జయశంకర్ సార్.. రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డప్పటికీ ఐదు లక్షల 50 కోట్ల అప్పులు ప్రజల నెత్తిన మోపినప్పటికీ 90 శాతం ప్రజలకు దక్కింది శూన్యమే. అవినీతిలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
హైదరాబాదు, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధి మాత్రమే తెలంగాణ అభివృద్ధి అని బంగారు తెలంగాణ నిర్మాతలు, తేల్చి చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది, సామాజిక న్యాయం అటకెక్కించబడింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మరో సామాజిక ఉద్యమం జరగవలసిన అవసరం వస్తుందని అనేక సభలలో ఉద్బోధించిన జయశంకర్ గారి స్ఫూర్తితో ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు తమ గళం విప్పి కలానికి పదును పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఆకాంక్షలు నెరవేర్చే దిశలో అందరం కృషి చేయవలసిన సమయం ఆసన్నమైంది. గత 54 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సామాజిక న్యాయం కొరకు ఆచార్య జయశంకర్ శిష్యునిగా అనుయాయుడిగా గమనించిన కొన్ని విషయాలు ఈ తరం విద్యార్థులకు మేధావులకు ఉద్యమకారులకు అందించవలసిన కర్తవ్యం లో భాగంగా గురువు జయశంకర్ గారికి జోహార్లతో సమర్పిస్తున్నాను.
image.png
ప్రొఫెసర్ కూరపాటి వెంకట్
నారాయణ




