జనాభా శాతం ప్రకారం ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

తాండూరు, ప్రజాతంత్ర,  సెప్టెంబర్ 2: జనాభా శాతం ప్రకారం ముదిరాజులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదికలో  పార్టీలకు ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ ల కోసం నియోజకవర్గాలలొ ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా ఓయూ క్యాంపస్ శివ ముదిరాజ్ ,రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పార్టీలకతీతంగా ముదిరాజ్ నాయకులతో పట్టణంలోని జగదాంబ టవర్స్ లోని హాల్లో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశంలో పలువురు ముదిరాజ్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూరాష్ట్రంలో 17% శాతం ఉన్న ముదిరాజులకు వచ్చే ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు 18 ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని అన్నారు అలా కేటాయించిన పార్టీలకి ముదిరాజుల మద్దతు ఉంటుందని తెలిపారు
ముదిరాజ్ ల హక్కుల కోసం ఐక్యమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయా పార్టీలో కొనసాగుతున్న ముదిరాజ్ లు తమ హక్కుల కోసం గళం విప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు బోయిని చంద్రశేఖర్ , రాష్ట్ర నాయకురాలు పుష్పలత, తాండూరు ముదిరాజ్ నాయకులు రవికుమార్, లొంక నరసింహులు, అల్లాపూర్ శ్రీకాంత్, బంటు వేణు, బీరప్ప మల్లప్ప, అమ్రేష్, జర్నప్ప, ఇందూర్ వెంకట్ ,నరేందర్,రాములు లొంక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *