కూకట్ పల్లి ప్రజాతంత్ర నవంబర్ 23: స్థానిక నియోజకవర్గంలో రాజకీయ వేడి పుంజుకుంది. అబ్యర్ధుల త్రిమూఖపోటీలో విజయం ఎవరిని వరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఇక్కడ బీజేపీ జనసేనా పొత్తులో భాగంగా పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీ నుండి నిలబడిన అభ్యర్థి ముమ్మడి ప్రేమ కుమార్ విజయం సాధించే పనిలో.. నిమగ్నమయ్యారు కానీ. పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ అభ్యర్థి “పార్టీకి కొత్త.. జనంలోను కొత్తే..” దీనితో పార్టీని పటిష్టపరిచేందుకు స్థానిక ప్రజలు సరిగా స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో జనసేనాకి కట్టుబడి ఉండాలా, లేదా అనే అయోమయంలో స్థానిక పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి . స్థానిక నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ కుంటుపడ్డదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారిందని కూకట్ పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న జనం లేని జనసేన ప్రచార యాత్రని చూస్తుంటే అద్దం పట్టినట్లు కనిపిస్తుంది. ఒకపక్క బీఆరెస్, కాంగ్రెస్ పార్టీ నేతలు హోరాహోరీగా కార్యక్రమాలు చేస్తూ జనాదరణ పొందుతూ, జనంలోకి చొచ్చుకుపోతుంటే, స్థానిక స్థానిక జనసేనా పార్టీ ప్రధాన నాయకుల్లో ఇదేమి లేకపోవడంతో ఆపార్టీ కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనితో స్థానిక నాయకులు చేసే ప్రచార యాత్రకు జనాదరణ కరువైందని పలువురు విమర్శించుకుంటున్నారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా కేంద్ర ప్రభుత్వ విధానాలను జనంలోకి తీసుకెళ్లి వివరించి జనాదరణ పొందాల్సి ఉంది.కానీ స్థానిక జనసేనా నాయకులు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయమై ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. స్థానిక పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కలిసి కట్టుగా పనిచేసి స్థానిక ప్రజలలోకి వెళ్తే కచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది అంటూ స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జనసేనాకి జనం దూరం





