• పటాన్ చెరు అంబేద్కర్ చౌక్ నుండి బీరంగూడ
• శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వరకు మహా పాదయాత్రకి వేలాదిగా హాజరైన సబ్బండ వర్గాలు
• బరిలో నిలబడుతున్నాం
• కలిసి పోరాడధాం.. గెలిచి చూపిద్దాం
• అంబేద్కర్ ఆశయాలతోముందుకు వెళుతున్న…సబండవర్గాల అభివృద్ధి నా లక్ష్యం
• చలి చీమల్ల ఐక్యమత్యంతో కొండ చిలువ పని పడదాం…త్వరలో నియోజకవర్గమంత పాదయాత్ర
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం తథ్యం. పాదయాత్ర మార్గమధ్యలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి, వడ్డే సోదరుల ఆహ్వానం మేరకు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మైనారిటీ సోదరుల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలో పాల్గొని ఆశీర్వాదం స్వీకరించిన నీలం మధు ముదిరాజ్ ఎన్ఎంఅర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాద యాత్రకు బహుజన సబండవర్గాల ప్రజలు పోటెత్తారు.ఈ మహా పాదయాత్రకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముందుగా పటాన్ చెరు మైత్రి మైదానం వద్దకు చేరుకున్న తన అభిమానులు, పాదయాత్రకు హాజరైన ప్రజలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకున్నారు.పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నీలం మధు ముదిరాజ్ పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు.మహా పాదయాత్రకు హాజరైన జనసందోహం కోరిక మేరకు నీలం మధు ముదిరాజ్ ముందుండి పాదయాత్రలో పాల్గొన్నారు.
మహా పాదయాత్ర కు హాజరైన ప్రజలనుద్దేశించి నీలం మధు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు పాటుపడుతూ, బీసీ ఉద్యమన్ని ముందుకు నడిపిస్తామన్నారు, బీసీ బిడ్డ చట్టసభల్లో గొంతు ఎత్తుతనే సబ్బండ వర్గాల ప్రజలందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు.తనను ఎమ్మెల్యే గా చూడాలనే సంకల్పంతో వేలాది సబ్బండ వర్గాల ప్రజలు తనకు మద్ధతుగా తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. మహా పాదయాత్రను అడ్డుకోవాలని కొంతమంది నేతలు ఎన్ని కుట్రలు చేసినా, పోలీస్ బలంతో పాదయాత్రను అడ్డుకోవాలని చూసిన ఆ కుట్రలను ఛేదించుకొని తరలివచ్చిన ప్రతి ఒక్కరికి జీవితాంతం ఋణపడి ఉంటానని అన్నారు.బహుజన నాయకుని ఎదుగుదల జీర్ణించుకోలేక కొందరు నేతలు మనల్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఐక్యమత్యంతో చలి చీమల్ల ముందుకు కదలి ఆ కొండచిలువల పని పడదామని పిలుపునిచ్చారు.తన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్న నాయకులకు పది మంది కుటుంబ సభ్యులు ఉంటే తనకు నియోజకవర్గ ప్రజలే కుటుంబ సభ్యులని పేర్కొన్నారు.
తన వెంట ఉన్న వేలాది మంది ఒక్కొక్కరు 100 ఓట్ల చొప్పున వేయించి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని నినాదించిన ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, క్రైస్తవ,సబ్బండ వర్గాల సత్తా నిరూపించాల్సిన సమయం ఆసన్నమైం దని, మన బలహీన వర్గాల బిడ్డలు చట్ట సభల్లో అడుగు పెడితేనే మన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని అన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర కు శ్రీకారం చూడుతున్నట్లు ప్రకటించారు. పాదయాత్రలో ప్రతి గడప తొక్కుతానని, ప్రతి ఒక్కరిని కలిసి మద్దతు కూడగట్టడంతో పాటు ప్రతి సమస్యను తెలుసుకుంటానని స్పష్టం చేశారు.కుల మతాలకతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాలు ఏకమై మన హక్కులను సాధించుకుందమని స్పష్టం చేశారు.జనమే తన బలంగా, బహుజనుల హక్కులే ఎజెండాగా, సబండవర్గాల సమస్యల పరిష్కారమే మేనిఫెస్టో గా ముందుకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు.
మీ అందరూ వెంట ఉంటే మీ ఆదరాభిమానాలు ఉంటే పార్టీ గుర్తులతో పనిలేదని సబండవర్గాల ప్రతినిధిగా మీ ఇంట్లో ఒక్కడు, మీ కుటుంబ సభ్యుడైన నీలం మధు ముదిరాజ్ ఒక గుర్తుగా ముందుకు వెళదామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా తనకు దేవుళ్ళతో సమానమని, తనను మీ ఇంటి బిడ్డగా భావిస్తూ పెద్ద మనసుతో తనను ఆశీర్వదించాలని కోరారు.తన మీద నమ్మకంతో వేలాదిగా తరలి వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు.మహా పాదయాత్ర ఆరంభం మాత్రమే ఈ యాత్రను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన నీలం మధు ముదిరాజ్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు,ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ కుల సంఘల నాయకులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు




