2023-24 ఆర్థిక సంవత్సరాపికి 8.2 శాతం
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 31 : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. అయాతే జిడిపి వృద్ధి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న 8.6 శాతం కంటే తక్కువగా ఉంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంటో ఇదే కాలానికి వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జిడిపి వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది.
ఈ మేరకు జాతీయ స్టాటిస్టికల్ కార్యాలయం అధికారికంగా గణాంకాలను విడుదల చేసింది. గణాంకాల ప్రకారం, ఆర్థిక వ్యవస్థ 2022-23లో 7 శాతం వృద్ధితో పోలిస్తే 2023-24లో 8.2 శాతానికి పెరిగింది. కాగా ఇదే కార్యాలయం జాతీయ ఖాతాల ప్రకారం 2023-24కు రెండవ ముందస్తు అంచనాలో జిడిపి వృద్ధి రేటును 7.7 శాతంగా అంచనా వేసింది. ఇదే సమయంలో చైనా 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది.





