జనగామ జిల్లాలో బండి సంజయ్‌ అరెస్ట్

జనగామ/కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌జనగామ జిల్లాలో మంగళవారం ఉదయం జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షను జిల్లా పోలీస్‌ ‌భగ్నం చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అరెస్టు చేస్తున్న తరుణంలో బిజెపి శ్రేణులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే మోహరించిన టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు బండి గోబ్యాక్‌ అం‌టూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. బిజెపి ప్లెక్సీలను చింపివేయడంతో టీఆర్‌ఎస్‌ ‌నాయకులపై, వాహనాలపై బిజెపి శ్రేణులు, వాహనాలపై రాళ్లదాడికి దిగారు. కేసీఆర్‌ ‌డౌన్‌డౌన్‌, ‌కేసీఆర్‌ ‌కుటుంబం అవినీతి ఆక్రమాలు బయటపెడుతున్నందుకే ప్రజాసంగ్రామ పాదయాత్రను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయముందని ఆరోపిస్తు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బిజెపి నాయకులు సోమవారం రాత్రి నిరసనకు దిగిన విషయాన్ని బండి సంజయ్‌ ‌గుర్తు చేశారు. నిరసన తెల్పుతున్న బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. బిజెపి నాయకుల అరెస్టుకు నిరసనగా బండి సంజయ్‌ ‌జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌మండలంలో పామునూరులో తలపెట్టిన ధర్మదీక్షను పోలీసులు భగ్నం చేయడం సరియైందికాదన్నారు.

పోలీసులు బండి సంజయ్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెల్సుకున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్దలానికి చేరుకున్నారు. పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య కొంత సేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. అయినప్పటకీ పోలీసులు వెనకడుగు వేయకుండా శాంతియుతంగా బండి సంజయ్‌ను అరెస్టు చేసి వాహనంలో తరలిస్తున తరుణంలో పోలీసు వాహనాన్ని కూడా అడ్డగించే ప్రయత్నం బిజెపి శ్రేణలు చేసినప్పటికి పోలిసులు సమయస్తూర్తితో బండి సంజయ్‌ ‌చిల్పూర్‌ ‌మండలం మీదుగా కరీంనగర్‌ ‌జిల్లా కేంద్రంలోని బండి సంజయ్‌ ‌నివాసానికి తరలించి హౌస్‌ అరెస్టు చేసినట్లు సమాచారం.అరెస్టు చేసి తరలిస్తున్న సందర్భంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..ప్రజా సంగ్రామయాత్ర ఎట్టి పరిస్దితుల్లో అపే పరిస్థితి లేదన్నారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాసంగ్రామ యాత్ర అనుకున్న గమ్యానికి(వరంగల్‌ ‌భద్రకాళి ఆలయం వరకు) కొనసాగుతుందన్నారు.

టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన…
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు జఫర్‌ఘడ్‌ ‌మండలం ఉప్పుగల్‌ ‌గ్రామంలో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు రోడ్డుపై బైఠాయించి బిజెపి డౌన్‌డౌన్‌ అం‌టూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ ‌పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను టీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆగ్రహంతో చింపి తగలబెట్టారు. దీంతో బిజెపి నాయకులు కూడా టీఆర్‌ఎస్‌ ‌నాయకులపై, వారి వాహనాలపై దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్త్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువురిని శాంతింపచేసేందుకు పోలీసు యంత్రాగానికి తలనొప్పిగా మారింది. జనగామ డీసీపీ సీతారాం ఆధ్వర్యంలో జనగామ, వర్దన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీలతో పాటు సీఐలు, పోలీసు సిబ్బంది ఇరువర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇరువర్గాల గొడవ పోలీస్‌కు పెను సవాల్‌గా మారి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందా అనే పరిస్దితి నెలకొంది.

సంగ్రామ యాత్రను నిల్పివేయాలి : ఏసీపీ
సంగ్రామ యాత్రను నిల్పివేయాలని వర్దన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్‌ ‌పడేలా ఉందని, పాదయాత్రను వెంటనే నిల్పివేయాలంటూ ఏసీపీ శ్రీనివాస్‌ ‌నోటీసులు జారీ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్‌ ‌గంగిడి మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిలకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. జనగామలో జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్రను తక్షణయే నిల్పివేయాలని, లేని యెడల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని ఆ నోటీసులో పేర్కోన్నట్లు సమాచారం. ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరిట బండి సంజయ్‌ ‌విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ధర్మధీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీగా జనసమీకరణ చేశారని, రెచ్చగొట్టే ప్రకటనలతో శాంతిభద్రతల విఘాతం కలిగే అవకాశముందని పేర్కోన్నట్లు తెలిసింది. తక్షణమే ప్రజాసంగ్రామ యాత్రను నిల్పివేయాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌దృష్టి మరల్చే కుట్ర…అందుకే అకారణంగా నా అరెస్ట్ : ‌వి•డియాతో బండి సంజయ్‌
‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. లిక్కర్‌ ‌స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కూతురుకో న్యాయం…? ఇతరులకో న్యాయమా..? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వొస్తున్న స్పందన చూసి టీఆర్‌ఎస్‌ ‌కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ‌దళితబంధుతో వోట్లను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కానీ కేసీఆర్‌ అహంకారాన్ని ప్రజలు ఓడించారని చెప్పారు. కేసీఆర్‌ ‌డబ్బు రాజకీయాలను ఓడించారన్నారు. తెలంగాణలో సూర్యుడు ఉదయిస్తాడు.. కమలం వికసిస్తుందన్నారు. కేసీఆర్‌ ‌పాలనను వ్యతిరేకిస్తున్నారు..తెలంగాణలో కేసీఆర్‌, ‌కల్వకుంట్ల వ్యతిరేక వాతావరణం ఉందని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ ‌పాలనను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బండి సంజయ్‌ ‌దీక్ష చేస్తే కొంపలు మునిగినట్లు కిటికీల ఊచలు కట్‌ ‌చేసి అరెస్ట్ ‌చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌వొచ్చాక పోలీసు వ్యవస్థనే భ్రష్టు పట్టించారని చెప్పారు.

బండిసంజయ్‌, ‌రాజాసింగ్‌ల అరెస్ట్ ‌దుర్మార్గం : అరెస్టులపై మండిపడ్డ బిజెపి నేతలు
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ల అరెస్ట్‌లను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులు, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆ ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మరోవై6పు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు ఆందోళన చేసినందుకు అరెస్ట్ ‌చేసిన 29 మందిని కూడా విడుదల చేయాలన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి తొత్తులుగా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బండి సంజయ్‌ అరెస్ట్‌ను ఆమె ఖండించారు. ఎందుకు అరెస్ట్ ‌చేశారో చెప్పకుండా పాదయాత్ర చేస్తున్న సంజయ్‌ను తీసుకెళ్లడం దుర్మార్గమన్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు కేసీఆర్‌ ‌ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్‌, ‌రాజాసింగ్‌ అరెస్టులను బీజేపీ ఎంపి ధర్మపురి అర్వింద్‌ ‌తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమన్నారు. దీనికి మూల్యం చెల్లంఇచక తప్పదన్నారు. అరెస్టులను జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ ‌వెంకటస్వామి ఖండించారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను టీఆర్‌ఎస్‌ ‌నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

ప్రజాసమస్యలపై పోరాడుతున్నందుకే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ ‌చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. తమను కించపరిచే విధంగా వీడియోలు అప్‌ ‌లోడ్‌ ‌చేశారని ముస్లీం నేతలు ఫిర్యాదు చేయడంతో రాజాసింగ్‌ ‌ను ఉదయం పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కేసు నమోదు చేసి ఆయన ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ ‌చేశారు. తెలంగాణలో రాముడిని కొలిచే వారికే విలువ లేదని..తిట్టే వారికే విలువ ఉందన్నారు. ప్రధానికి కూడా కల్పించనంత భద్రత మునావర్‌ ‌ఫారూఖికి ఇచ్చి..షో ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బండి సంజయ్‌, ‌రాజాసింగ్‌ల అరెస్టులను ఈ పార్టీ ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ‌ఖండించారు. కేసులు, అరెస్టులతో భాజపాను అడ్డుకోలేరని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన చేస్తుంటే..కేసులు పెడతారా అని రఘునందన్‌ ‌ప్రశ్నించారు. మూడుసార్లు నోటీసులు మార్చి కేసు నమోదు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలపై తెరాస నేతల దాడి ఘటనపై ఫిర్యాదు చేశామని..ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ ‌పీఎస్‌లో ఉన్న 29 మంది కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని రఘునందన్‌, ఈటల డిమాండ్‌ ‌చేశారు.

రాష్ట్రంలో పరిణామాలపై నడ్డా ఆరా : బండి అరెస్ట్‌పై కిషన్‌రెడ్డికి ఫోన్‌
‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌ ‌చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. నిన్న ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద జరిగిన నిరసన కార్యక్రమం..ఇవాళ బండి సంజయ్‌ ‌హౌజ్‌ అరెస్ట్..‌ప్రస్తుత పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లాలోని పామునూరు వద్ద బండి సంజయ్‌ను అరెస్ట్ ‌చేసిన పోలీసులు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయంపై మొదట క్లారిటీ ఇవ్వలేదు. సిద్ధిపేట, కరీంనగర్‌ ‌పీఎస్‌కు తరలిస్తారని ప్రచారం జరిగినా చివరకు ఇంటికి తరలించారు. ప్రజాసంగ్రామ పాదయాత్రకు కేంద్ర బలగాలు కావాలని బండి సంజయ్‌ ‌కోరారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసిన ఆయన రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *