- దేవాదులు ద్వారా నీటి తో నిండిన జనగామ జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువులు,కుంటలు
- పంట పొలాలతో సస్యశ్యామలం
- జనగామ నియోజకవర్గ సోషల్ మిడీయా ఇంచార్జీలతో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్,పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశం
జనగామ ప్రజాతంత్ర,సెప్టెంబర్ 29 :జనగామ గడ్డ వీరుల రక్తంతో తడిసిన గడ్డ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.రఘనాధపల్లి మండలం నిడిగోండ గ్రామంలోని ఓపంక్షన్లో శుక్రవారం బిఆర్యస్ పార్టీ జిల్లా ఆధ్యక్షుడు, జెడ్పి చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఆధ్యక్షతన బిఆర్యస్ జనగామ నియోజకవర్గ సోషల్ మిడీయా ఇంచార్జీలతో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్,పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలోని హస్తకళాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోని ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారన్నారు. ప్రతి ఒక్కరు జనగామ మట్టిని,చరిత్రను మొక్కాలని ఎందుకంటే జనగామ గడ్డ వీరుల రక్తంతో తడిసిన గడ్డ అన్నారు.గత ప్రభుత్వాల పాలనలో జనగామ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదాన్ని బుక్కెడు నీళ్ల కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పోన్నాల లక్ష్మయ్య స్వంత నియోజకవర్గానికి ఓరగబెట్టింది ఏమి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధికారంలో ఉన్న సమయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక సిఎం కేసిఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దేవాదులు ద్వారా జనగామ జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలు నింపడం జరిగిందన్నారు.ఒకప్పుడు ఏడారి ఉన్న జనగామ ఇప్పుడు పంట పొలాలతో సస్యశ్యామలంగా మారిందన్నారు. జనగామ జిల్లాకు చెందిన ఒగ్గు కళాకారుడు సుక్క సత్తయ్య కళాకారుడిగా గుర్తింపు పోందిన వ్యక్తి అని ఆయన విగ్రహన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు.50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ఆబివృధ్ది శూన్యమని మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో కోత్త కోత్త పథకాలను ప్రవేశపెట్టి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్పిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధికారంలోకి వస్తే మళ్లీ పాతాళంలోకి వేళ్లినట్లేనని,నాటి కరువు తిరిగి చూసే రోజులు వస్తాయన్నారు.
ఆనంతరం రైతు బంధు సమితి రాష్ట్ర ఆధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో జనగామ గడ్డ మీద ప్రజలు చేసిన పోరాటాలు, అందించిన సేవలు,చేసిన త్యాగాలు ,ఎంతో మంది ఆమరులైన వారి స్పూర్తి మరువలేనివన్నారు.2001లో తెలంగాణ ఉద్యమం నుండి జనగామ ప్రజలు సిఎం కేసిఆర్ వెంట ఉండి మలిదశ రాష్ట్ర సాధనలో,.అనేక సాయుధ పోరాటలు చేసిన చరిత్ర జనగామ గడ్డకు ఉందన్నారు.జనగామ ప్రజలు త్రాగేందుకు కూడా నీరు దోర్కక అనేక ఇబ్బందులు పడేవారని కరువు ప్రాంతమైన జనగామ కు జనగామ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గెలిచాక దేవాదులు ద్వారా సాగు,త్రాగునీరు అందించడం జరిగిందన్నారు. వ్యవసాయమే దండుగఅనే స్థాయి నుండి నేడు వ్యవసాయమే ఒక్క పండుగ అనే స్థాయికి తిసుకోచ్చిన ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కిందన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతున్నలను రాజుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రైతులకు రైతుబంధు ,రైతుబీమా,ఉచిత కరెంట్ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు.మిషన్ భగిరథ ద్వారా 45వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన నీరు అందించడం జరుగుతుం దన్నారు. కాంగ్రెస్,టిడిపి పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదన్నారు. సిఎం కేసిఆర్ చేస్తున్న ఆబివృద్దిని చూసి దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తుందన్నారు..రానున్న ఎన్నికల్లో సోషల్మిడీయా ఏవిధంగా పనిచేయాలో తెల్పిం దుకే ఈసమావేశం నిర్వహించడం జరిగిం దన్నారు. సోషల్ మిడియాలో ఉత్సాహంగా పనిచేసే వారినే తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సోషల్ మిడియా బలంగా ఉందని ఎవరిని కూడా భూతులు,కించపర్చకుండా, నింధించకుండా, తిట్టకుండాదని విమర్శకు ప్రతివిమర్శతో సమాధానం చేప్పాలన్నారు.ఇది ఇలాఉండగా బిఆర్యస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల ముఖ్య కార్యకర్తలు,ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.




