అవకాశ వాద పొత్తు, దాని వెనక అజెండాను బహిర్గతం చేయడంలో జగన్ విజయం సాధించారు. సంక్షేమం అజెండాను బలంగా ముందుకు తీనుకెళ్లి తాను వొచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో జగన్ చెప్పాడు. ఆ అంశాల జోలికి విపక్షాలు వెళ్లకుండా, జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. అలాగే వైఎస్ కుటుంబం, వివాదాలు, ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై సంబంధం లేని అంశాలను ఎన్నికల ప్రచారంలోకి తెచ్చారు. మాకు ఎందుకు వోటు వేయాలి.. ఏమి ప్రయోజనం అని చెప్పడంలో టీడీపీ కూటమి విఫలమైందనిపిస్తుంది.
ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో గెలిచే హీరో పార్టీపై బెట్టింగ్‌ల పర్వం తారా స్థాయికి చేరుకుంది. ప్రతి వోటరు ఒక యూ ట్యూబర్ కథకుడిగా అనలిస్టుగా మారాడు. రెండు పార్టీల అభిమానులు తమ పార్టీకి అనుకూలంగా ఊహాజనితమైన అంశాలను జోడించి గెలుపు ఓటమిలపై కథనాలను వినిపిన్తున్నారు. తలా తోకలేని అంశాలకు మసాలా కలిపి ఆసక్తికరమైన కథనాలతో జనాన్ని రంజింపచేన్తున్నారు. అర్ధవంతమైన చర్చలు లేవు. ఆఖరికి జన సమూహాలను, వోటర్లను పూల్ చేసే విధంగా వ్యవహరిస్తున్న ఫేక్ మీడియా వారిని ఆంధ్రా ప్రజలు జూన్ 4వ తేదీన ఫూల్ చేస్తారు. రాజకీయాల్లో ఓపిక కావాలి. జనం నాడి పసిగట్టేందుకు వివేచన ఉండాలి. అంతేకాని మన భావాలను విశ్లేషణలో చొప్పించి దుష్ట సంస్కృతి పెచ్చుమీరింది. ఇది వైకాపాకు, టీడీపీ కూటమికి మంచిది కాదు.
ఎన్నికల ఫలితాలపై ఊహలకు అంతు లేదు. మా పార్టీగెలుస్తుందంటే, మాది గెలుస్తుందంటూ ఒకటే చర్చ. వైకాపా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని , సన్నాహాలు చేస్తున్నామని వైకాపా ప్రచారం చేసుకుంటోంది. మనకు తెలుగు పాట గుర్తుకు వస్తుంది. ఇది వెన్నల వేళయని, మల్లేల మాసమని, తొందర పడి ఒక కోయిల ముందే కూసింది అనే పాట ఆంధ్రాలో అధికారంలోకి రావాలనే పార్టీలకు అతికినట్లు సరిపోతుంది. నేను అమలు చేసిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి, మళ్లీ గెలిచి రెండవసారి అధికారంలోకి వొస్తామన్న ధీమాతో జగన్ ఉన్నారు. ప్రతి పక్ష పార్టీలు విసిరిన సవాళ్లకు సంక్షేమమే పరిష్కారమని, అందుకే తానే అధికారంలోకి వొస్తానని, జనం తన వెంట ఉన్నారని, జగన్ బలంగా నమ్ముతున్నారు.
ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. జనం విశేషంగా వోట్లు వేశారు. కౌంటింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఎన్నికల పిచ్చి, కుల ఉన్మాదం హద్దులు దాటింది. ఎడతెగని చర్చలు. ఆవేశాలు, ఉద్రేకాలు కనపడుతున్నాయి. ముల్లానసిరుద్దీన్ కథ గుర్తుకు వొస్తుంది. నసీరుద్దీన్ గాడిదల వ్యాపారం చేస్తాడు. ప్రతి రోజు గాడిదలను తీసుకుని సరిహద్దు దాటి సాయంత్రం ఇంటికి వొచ్చేస్తారు. సరిహద్దు పోలీసులు స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నాడా అనే అనుమనంతో ఎన్నిసార్లు తనిఖీ చేసినా ఏమి దొరకదు. నసీరుద్దీన్ గాడిదల వ్యాపారం చేస్తున్నాడనే విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. ఆంధ్రాలో కూడా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని స్థితి. నసీరుద్దీన్ గాడిదలను స్మగ్లింగ్ చేస్తున్నాడనే విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోయారు. గాడిదలు తీసుకెళ్లే సరుకులపైనే పోలీసులు దృష్టి పెట్టారే తప్ప, గాడిదలనే ప్రతి రోజు సంతకు తీసుకెళ్లి అమ్మి, అమ్ముకోలేని వాటిని తిరిగి తెస్తున్నారనే విషయాన్ని పోలీసులు గ్రహించలేదు. అలాగే వోటర్లు సంక్షేమ పథకాలను అనుభవించారు.
ఆ సంక్షేమ పథకాలను ఎవరు వొచ్చినా కొనసాగించాల్సిందే. కాని వోటర్లు ఏ కోణంలో ఎవరికి వోటు వేశారనే విషయాన్ని అనలిస్టులు అంచనా వేయలేకపోతున్నారు. ఎంత సేపు పెద్ద ఎత్తున అర్బన్ వోటర్హు, ఉద్యోగులు, మిడిల్ క్లాసు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులు స్వరాష్ష్రానికి వొచ్చి వోట్లు వేశారని, ఇదంతా జగన్ కు వ్యతిరేకంగా వోట్లు ర్యాలీ అవుతున్నాయనే గుడ్డి నమ్మకంతో అనలిస్టులు మాట్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో వోటర్లు సైలెంట్‌గా వోట్లు వేశారు. ఈ వోట్లు ఎవరికి వెళ్లాయి. వాలంటీర్ల వల్ల సంక్షేమ పథకాలు జనానికి చేరేవి. ఈ వ్యవస్థ కోణంలో అనలిస్టులు ఆలోచించడం మాని తమకు ఇష్టం వొచ్చినట్లు స్టోరీలను అల్లి జనం మీదకు వదులుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వోటర్లు పెద్ద ఎత్తున ఏ పార్టీకి గంప గుత్తగా వోట్లు వేశారనే విషయాన్ని దాచిపెట్టి తమకు అనుకూలమైన కోణంలో యూట్యూబ్‌లో స్టోరీలను వదులుతున్నారు. ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. వైకాపా గెలవలేదు. ముహూర్తం ఖరారు చేసుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో సంక్షేమం జగన్‌ను గెలిపిస్తుందనే ప్రచారంతో కూడా స్టోరీలను అల్లేస్తున్నారు. తాను అమలు చేసిన సంక్షేమమే తనను గెలిపిస్తుందనే ధీమాలో జగన్ ఉన్నారు. లబ్దిదారులు పట్టణ మధ్యతరగతి వర్గాల అసహనాన్ని పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వొచ్చారు. కార్పోరేట్ తరహాలో ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబును జగన్ మట్టికరిపించారు. కాని కేవలం సంక్షేమ ఫలాలే జగన్‌ను గట్టెక్కిస్తాయానీ.. సంక్షేమం వల్లనే పేదలు, లబ్ధిదారులు రెండోసారి అవకాశం ఇస్తారనే నమ్మకంతో వైకాపా ఉంది.
ఆంధ్రా లాంటి రాష్ట్రంలో పోలింగ్ నరళి భిన్నంగా ఉటుంది. అక్షరాస్యత ఎక్కువ. సామాజిక సమీకరణలు హె స్పీడుగా ఉంటాయి. ఎన్నికల ఫలితాలపై అభివృద్ది అజెండా పాత్ర ఎక్కువగా ఉంటుంది. మౌలిక నదుపాయాలు, అభివృద్ది ఆగిపోయింది. పాలన అంటే ఒక సంక్షేమం మాత్రమే కాదని విపక్షాలు విశేషంగా ప్రచారం చేశాయి. జగన్‌కు మహిళలు బ్రహ్మరథం పట్టారు. విశేషమైన స్పందన ఉంది. మైనార్టీ వోట్లు గ్రామీణ వోటర్లు, లబ్ధిదారులు జగన్ వైపు నిలిచారనిపిన్తుంది. అర్బన్ వోటర్ల మాదిరిగా వీరు మాట్లడరు. అందుకే క్లాస్ వార్ అనే పదాన్ని, నినాదాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. గ్రామీణ వోటర్లు గంపగుత్తగా తమవైపు నిలిచారని జగన్ బలంగా నమ్ముతున్నారు. అర్బన్ వోటర్ల చికాకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదా ? వీరి ప్రభావం గ్రామీణ వోటర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులపై ఎటువంటి ప్రభావం ఉండదని కొంత మంది అనలిస్టుల అంచనా . మరి కొంత మంది అనలిస్టులు అభివృద్ది అజెండా ప్రభావం వల్ల పాలక పక్షానికి అనుకున్నట్లుగా వోట్లు పడలేదంటున్నారు. సంక్షేమం అజెండా కంటే ప్రజలు అభివృద్ది అజెండాకు ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు.
2014-2019 ఎన్నికల సరళి వేరు. జగన్ పాలన 2019లో ఆరంభమైంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సంక్షేమం అజెండాతో జగన్ జనం ముందుకు వెళ్లారు. 2014లో అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలని జనం అనుకుని టీడీపీకి వోట్లు వేశారు. 2019లో మార్పు కావాలనుకుని వోట్లు వేసి వైకాపాకు అవకాశం ఇచ్చారు. ఈ 2014 ఎన్నికలు జగన్ అనుకూల వ్యతిరేక శక్తులుగా చీలిపోయింది. అంటే జగన్ పాలన రెండోసారి కావాలా వొద్దా అనే విధంగా పోలింగ్ సరళిని చూస్తే అర్ధమవుతుంది. అవకాశ వాద పొత్తు, దాని వెనక అజెండాను బహిర్గతం చేయడంలో జగన్ విజయం సాధించారు. సంక్షేమం అజెండాను బలంగా ముందుకు తీనుకెళ్లి తాను వొచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో జగన్ చెప్పాడు. ఆ అంశాల జోలికి విపక్షాలు వెళ్లకుండా, జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. అలాగే వైఎస్ కుటుంబం, వివాదాలు, ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై సంబంధం లేని అంశాలను ఎన్నికల ప్రచారంలోకి తెచ్చారు. మాకు ఎందుకు వోటు వేయాలి.. ఏమి ప్రయోజనం అని చెప్పడంలో టీడీపీ కూటమి విఫలమైందనిపిస్తుంది.
విపక్ష కూటమి బలమైందే కాని సమన్వయం కొరవడిందనే అంశాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ జనసేన మ్యానిఫెస్త్టోను బీజేపీ ఆమోదించలేదు. ఆంధ్రా వోటర్లు తెలివైన వోటర్లు. సంక్షేమానికి పట్టం గడతారా ? లేక అభివృద్ది అజెండా ముసుగులో వొచ్చిన కూటమికి మద్దతు ఇస్తారా… ఇది ఒక రకంగా విశ్వసనీయతకు సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికలు ప్రజలు విశ్వసనీయతకు పట్టం గట్టనున్నారా ? కేవలం కొన్ని అవాస్తవమైన అంశాలను తెరపైకి తెచ్చి జనాన్ని గందరగోళ పరిచి విపక్షాలు లాభపడుతాయా ?ఎవరెన్ని చెప్పినా పోలింగ్ రోజు వోటర్లు పోటెత్తారు. ఉత్సాహంతో పోలింగ్ రోజు ఆంధ్ర రాష్త్రం కళ కళ లాడింది. జగన్‌ను గెలిపించాలా లేక ఓడించాలా అనే సింగిల్ కాన్సెఫ్ట్‌పై ఎన్నికలు జరిగాయి. జనం రాత్రి పొద్దు పోయే వరకు వోట్లు వేశారు. అనలిస్టులు తమ కోణంలో చర్చలు మాని వోటర్ల నాడిని పట్టుకోవడంపై శక్తిని కేంద్రీకరించాలి.
-శామ్ సుందర్





