జగదేవపూర్, ప్రజాతంత్ర డిసెంబర్ 19: జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను వివరిస్తూ ఎమ్మార్వో తమ నివేదికలు విరిస్తూ ఓటరు నమోదు కార్యక్రమం వినియోగించు కోవాలని ఒకటోవ వార్డు నెంబర్ లో ఉన్నా ఒక ఓటరు పేర్లు పదవ ఓటరు వార్డులో పడుతున్నావని సరిచేయాలనీ అన్నారు.పీర్లపల్లి ఎంపీటీసీ రైతుల ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్లు రైతులకు తెలవకుండ కట్ చేయకుండా ప్రజాప్రతినిధులకు తెలవని అన్నారు. రైతులకు అన్యాయం చేయడం మంచి కాదని ట్రాన్స్ఫార్మర్ మీద ఎన్ని కనెక్షన్లు చూసుకుని సరిచేసి కనెక్షన్ ఇవ్వాలని హెచ్చరిక చెశారు.ప్రతి అధికారి ప్రజా ప్రతినిధులతో కలిసి ఉండాలని అన్నారు.సభకు అధికారులు సమయంలో పాలన పాటించలని సకాలంలో హాజరు కావాలని అన్నారు.తీగుల్ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో స్పాన్సర్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్, మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచల్ల నరేష్,పాక్స్ చైర్మన్ ఇంద్ర సేనా రెడ్డి,సయ్యద్ ఇక్బాల్, ఎమ్మార్వో శ్రవణ్ కుమార్, సర్పంచులు యాదవ రెడ్డి, చంద్రశేఖర్, వెంకట్ రామ్ రెడ్డి కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రకాష్ రావు, ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్,పంచాయతీ సెక్రటరీ లు, అధికారులు తదితరులు ఉన్నారు.




