జంగారెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : కల్వకుర్తి నియోజకవర్గం లోని అమనగల్లు మున్సిపాలిటీ జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతథిగా పాల్గొన్నారు .దుడ్డు కృష్ణ, ఉప్పుల రవి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మండ్లి రాములు, పట్టణ అధ్యక్షులు వస్ఫుల మానయ్య చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అదేవిధంగా మహిళలు యువకులు పెద్దఎత్తున కాంగ్రెస్ కండువాలు కప్పుకొని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ చేరారు.  గ్రామంలో గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అనారోగ్యంతో బాధ పడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 5 కుటుంబాలకి   రూ.5వేల చొప్పున సహాయం అందించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి గ్రామ ప్రజల కోరిక మేరకు గుడి అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మండ్లి రాములు, మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షులు వస్పుల మానయ్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు అనిల్, రంగారెడ్డి జిల్లా యుత్ కాంగ్రెస్ అద్యక్షులు రవికాంత్, మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రాజశేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణ, ఉప్పుల రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీను, ఫాతకోట రాజు , సురేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *