నలుగురు మావోయిస్టులు మృతి
కొందరికి గాయలు
భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్ 02 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజా పూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మంగళ వారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యా యని బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్‌రాజ్ తెలిపారు. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తిం చారు. గుర్తింపు ప్రక్రియ కొనసాగు తోందని అధికారులు తెలిపారు. అక్కడికక్కడే ఉన్న రక్తపు మరకలు తిరుగుబాటుదారుల ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.అయితే, అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహి స్తున్న భద్రతాబలగాలకు, మావో యిస్టులు తారసపడ్డట్లు తెలుస్తోం ది.
ఈ క్రమంలో భద్రతాబలగాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకు న్నాయి. ఘటనా స్థలం వద్ద మందుపాతరలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈదాడిలో సిఆర్‌పిఎఫ్, దాని ఎల్కెట్ వింగ్ కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్‌కు చెందిన జవాన్లతో కూడిన బృందం మంగళవారం ఉదయం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి-లేంద్ర అడవుల్లో మావోయిస్టు పై ఎదురుకాల్పులు జరిపారు.జవాన్లు అందరూ క్షేమంగా ఉన్నారని, మధ్యాహ్నం నాటికి బృందం తిరిగి స్థావరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.వారంరోజుల్లోనే ఇది నాల్గవ ఎన్‌కౌంట్ జరిగింది.నాలుగురోజులక్రితమే 6గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం విధితమే .మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.





