చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్2: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో తొమ్మిదివేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే విధంగా కృషి చేశామని అని తెలిపారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి తానుఅత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. ప్రతి ఒక్క బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బిఅర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల వివరిస్తూ పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, మహిళలు, టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *