మా ఇంటి నుండి
శుభోదయ శుభాకాంక్షలు
గాలి కెరటాల్లో తేలియాడుతూ
పలకరిస్తాయి పులకరింప చేస్తాయి
మెత్తగా సుతిమెత్తగా…
మీ ఇంటి నుండి
ఉదయ సన్నాయిరాగాలు
లయబద్ధంగా
అనురాగాలు ఒలక బోస్తూ
వసంతకాల ఆనందాలను
అందిస్తాయి…
దూరాలు పెరిగి తే
బంధాలు దూరమౌతాయి
అది పాతమాట
నేడు దూరాలు పెరిగిన
బంధాలు బలంగానే ఉన్నాయి…
మంచి చెడులు
ఉదోగ్య సద్యోగాలు
వ్యాపార లావాదేవిలు
ఒకటేమిటి అన్నీ
కంటిముందు దృశ్యమానమే…
కుంచిత బుద్ధి మురికి గుంట లాంటిది
దగ్గరున్న కంపు కొడుతుంది
గొప్పమనసు గోదావరి లాంటిది
దూరాలను లెక్క చేయదు
ఇది కలసి ఉండే కుదరని కాలం
ప్రేమజీవనంలో
దూరాలు తగ్గుతాయి
బంధాలు దృఢపడతాయి.
– రేడియమ్
ఫోన్.9291527757




