హౌరా స్టేషన్లో సాయంత్రం 5 గంటలకి దిల్లీ వేళ్ణే రాజధాని ఎక్స్ప్రెస్ కోసం ప్రయాణీకులు సన్నద్దమవుతూ రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. జనాల్ని చూస్తూ నేను, నా భార్య రమాదేవి కూడా కాలక్షేపం చేస్తున్నాము. ఇంతలో ఒకతను ట్రాలీ తీసికొచ్చి ప్రక్క కుర్చీ దగ్గరపెట్టి కూర్చున్నాడు. తలకి మఫ్లర్, స్వెట్టరు వేసుకున్నాడు. ముఖ కవళికలు సరిగ్గా కనపడటం లేదు. రెండు నిమిషాల తర్వాత సాబ్ ఆప్ కహాతక్ జయేంగే అన్నాడు. అంతలోనే కౌన్సా గాడీకేలియే ఆప్ అన్నాడు. మార్చి మార్చి ఒకే ప్రశ్న అడిగాడు. నేను మౌనంగా ఉండేసరికి, నాకు హిందీ రాదనుకుని, ‘వేర్ ఆర్ యు గోయింగ్ ‘ అన్నాడు. దిల్లీ తక్ అని జవాబిచ్చాను. ఓరి గెడ్డపువాడా, నాకు హిందీ రాక కాదురా, నీ ముఖం ఎక్కడో చూసినట్లున్నదిరా అని మనసులో అనుకున్నాను.
సాబ్ మ్కె ఖానా లేకే ఆవుంగా, కృపయా బేగ్ దేక్సక్తాహైక్యా, పాంచ్ మినట్ అని అడిగాడు. సరే అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. ఇంతలో రైలు వచ్చింది. నా శ్రీమతి నన్ను కంగారు పెట్టసాగింది. వాడు ఇంకా రాలేదు. నా శ్రీమతిని రైలు ఎక్కించి, వాడికోసం ఎదురుచూడసాగాను. పావుగంట తర్వాత వాడు వచ్చి మా భోగీలోనే ఎక్కి మా ప్రక్క బెర్తుపై కూర్చున్నాడు. మా బెర్తులు సౌకర్యంగా ఉన్నాయి . ఆ గెడ్డపు వాడు తన బేగ్లోంచి ఏదో వెతుక్కుంటున్నాడు. అవును ఇందాకా వాడు ఖానా తెచ్చుకుంటానన్నాడు కదా, ఆ ఖానాఖజానా రాజధానిలోనే దొరుకుతుందికదా, వాడికి ఈ విషయం తెలీదా లేక మరేద్కెనా పనిమీద వెళ్ళాడా అని ఆలోచించ సాగాను. ఇంతలో నాభార్య నన్ను, పైన పెట్టిన బేగ్లోనుంచి తన ఫోను తీసిమ్మంది. రైలు బయలుదేరగానే మా అబ్బారు వంశీ మెసేజ్ పెట్టమన్నాడు. ఫోను తీసిచ్చాను. అంతే అందులో మునిగిపోయింది.
రైలులోనుంచి బ్కెటకు చూస్తూనే, గెడ్డపువాడి గురించి ఆలోచించసాగాను. ఆ!! మన చంటిగాడు ఇలాగే ఉండేవాడు. మఫ్లర్ తీసివేస్తే ముఖం బాగా కనబడుతుంది. రాత్రి తొమ్మిది అయింది. నా భార్య మాతో తెచ్చుకున్న భోజనం పెట్టింది. ఆ గెడ్డపువాడు కూడా భోజనం చేసి, పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకున్నాడు. వీడి వాలకం చూస్తే పరిచయం ఉన్నవాడిలా అనిపిస్తున్నాడు. కాని నాకు తెలిసిన వాళ్ళలో హిందీ వాళ్ళులేరు. ఈ విషయాన్నే నా భార్యని అడిగాను. అదా సంగతి, రైలు ఎక్కినప్పటినుంచి మీరు పరధ్యాన్నంగా ఉన్నారు. ఆ దిక్కుమాలిన వాడికోసం ఇంత ఆలోచన ఎందుకు. తెలుసుంటే వాడే మనల్ని పలకరించేవాడు కదా అని తన ధోరణిలో చెప్పింది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి అని సలహా కూడా ఇచ్చింది. తప్పక పడుకున్నాను. కాని ఆలోచనలు నన్ను వీడటంలేదు. గతంలోకి ప్రయాణించాను.
తన మేనమామ వరస ప్రకాశరావుగారి అబ్బాయి చంటి. పెద్ద ఉద్యోగం, పెద్ద ఆఫీసరు అంటూ తెగ కలలు కనేవాడు. ఇది ఎప్పుడో పాతికేళ్ళనాటి మాట. చంటి పుట్టినప్పుడు ప్రభాకరం అని పేరు పెట్టి ముద్దుగా చంటి అని పిలుస్తూ ఉండేవారు. చంటి తరువాత చాలా కాలానికి ప్రభావతమ్మకి ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకి బేబి అనే వ్యవహార నామం. సాధారణంగా ఇంట్లో ఆఖరి వారికి చంటి అని పిలుస్తూ ఉంటారు. చెల్లెలు పేరు బేబీ అయింది కాబట్టి ఇక మన చంటి ముద్దు పేరుకి ధోకా లేదు. చిన్నప్పటి నుంచి ఎంతో పట్టుదలగా చదివేవాడు. పుస్తకం చేత పట్టితే పూర్తయితేనే లేచేవాడు. తిండీ, నిద్ర పట్టించుకునేవాడు కాదు. మంచి మార్కులే సంపాదించేవాడు. పెద్ద పెద్ద బుగ్గలు, నున్నగా దువ్విన తల, లూజ్ చొక్కాలు, బూట్లు, కొంచెం వెరైటీగా ఉండేవాడు. తోటి పిల్లలతో ఆడుకునేవాడు కాదు. వాళ్ళమ్మతో చదరంగం, గవ్వలు మొదల్కెనవి ఆడుకునేవాడు. మద్రాసులో ఐ.ఐ.టీ సీటు దొరికింది.
ప్రకాశం మామయ్య చంటిని తీసికెళ్ళి హాస్టల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేసి జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణంలో విజయవాడలో తన చెల్లిలిని చూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆశ్చర్యకరంగా, చంటి గదిలో ల్కెట్లు, ఫ్యాను తిరుగుతుంటే తన భార్యకేసి ప్రశ్నార్థకంగా చూసాడు. అక్కడ కృత్రిమ అలవాట్లు, కొత్త వ్యక్తులు, నచ్చని ఆహార పదార్థాలు అసౌకర్యంగా బాధిస్తూ ఉంటే జనరల్ టికెట్ కొనుక్కుని మరునాడు రాత్రే రైలు ఎక్కేసాడు. నిన్న రాత్రే చంటి ఇంటికి చేరాడు. ఇక ఇక్కడే చదువుకుంటానంటున్నాడు అంది భార్య. ప్రకాశం మామయ్య బాధపడుతూ ఏమీ అనలేక మిన్నకుండిపోయాడు. అందుకని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు. ఐ.ఐ.టి.లో చదువుకోవలసిన వాడు.
చదువ్కె ఉద్యోగం ప్రయత్నించే సమయంలో కేంద్రప్రభుత్వంలో ఉద్యోగానికి పరీక్షరాసి, ఆర్హత సాధించాడు. ఇంటర్యూ నిమిత్తమ్కె ముంబయి వెళ్ళవలసి వచ్చింది. చదువు పూర్తయేసరికి కొంత పరిపక్వత వచ్చింది. సరైన సమయానికే ఇంటర్యూకి చేరినప్పటికి అక్కడ లిప్టు పనిచేయక పోయేసరికి 11వ అంతస్తుకి మెట్ల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. ఇంటర్యూ చక్కగా చేసినప్పటికి, మెడికల్ టెస్టులో గుండె దడ ఎక్కువగా ఉందని ఎంపిక చేయలేదు. కనీసం ఆ సమయంలో కొద్దిగా బుర్ర ఉపయోగించాలి కదా, అబ్బే అలా చేయక తలాడించి వచ్చేసాడు. కాని ఆ తర్వాత మరొకచోట పెద్ద అధికారిగా ఉద్యోగము సంపాదించినట్లు తెలిసింది. ఆ ఇంటికి రాబోయే కోడలు విషయంలో అందరూ చర్చించుకునేవారు. మంచి చదువు, ద్కెవభక్తి ఉన్న అమ్మాయిని చూడమని తన తల్లితో చెప్పేడు. చంటి తల్లికి మంచి కుటుంబం నుండి వచ్చిన పిల్లయితే బాగుంటుంది, ఒద్దికగా ఉంటుంది అని అనుకునేది.
ప్రకాశరావుకి ఎటువంటి ప్రత్యేకమ్కెన కోరికలు లేవు. చెల్లెలు బేబీ మాత్రం రాబోయే వదినకి పెద్ద జడ ఉండాలి అని అనుకునేది. పెళ్ళి చూపులలో అత్తగారు అమ్మాయికి చిన్న చిన్న పరీక్షలు పెట్టేది. భక్తి ఉందో లేదో తెలుసుకోవటానికి ఉద్దరణి, పంచపాత్ర పట్టుకు రా అని, వంటింటి పోపు సామానులు తెలుసోలేదో అని పరీక్షించటానికి కొద్దిగా గసగసాలు పట్టుకురా అని, బంధువుల వరసలు తెలుసో లేదోనని చుట్టరికాల మీది ప్రశ్నలు వేసి పరీక్షించేది. చివరకు అన్ని పరీక్షలు పాసైన అమ్మాయి వసుంధర ఆ ఇంటి కోడలిగా వచ్చింది. ఆ తరువాత చంటిగాడి జీవితం నందనవనమయింది.. ఏదో కారణం చేత మేము పెళ్ళికి వెళ్ళలేకపోయాము. వీడి భావాలకు తగిన భార్యే దొరికింది. ఆ తరువాత వాడి విషయాలు మాకు తెలియలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అనుకుంటూ ఉండగా నిద్ర పట్టేసింది. నేను క్రింద బెర్తు మీద పడుకున్నాను. ఆ గడ్డపువాడు పైనున్న బెర్తుమీద పడకుని, డ్కెరీ తీసుకుని ఏదో వ్రాసుకుని దానిని తన తల క్రింద పెట్టుకుని పడుకున్నాడు.
అర్థ్రరాత్రి సమయంలో పై నుంచి ఏదో క్రింద పడిన శబ్దం అయితే క్రిందికి చూసాను. వాడి డ్కెరీ పడింది. అప్రయత్నంగా దానిని తీసాను. తెరవబడి ఉన్న డ్కెరీలో వాళ్ళ అమ్మ, నాన్న ఫోటోలు, క్లుప్తంగా వారి వివరాలు ఉన్నారు. ఆ వివరాలు చూడగానే సంతోషం పట్టలేక భార్యని కుదుపుతూ లేపాను . చిరాగ్గా ముఖం పెట్టి ఎందుకు అంత కంగారు, అప్పుడే స్టేషను వచ్చేసిందా అని అసహనంగా అడిగింది. కాదు కాదు ఆ గడ్డపువాడు మరెవరో కాదు మన చంటిగాడే, తెలిసిపోయింది అన్నాను . సరే ఈ విషయాన్ని అర్థ్రరాత్రి చెప్పాలా చాల్లెండి పడుక్కోండి అని విసుక్కుంది. డ్కెరీని తిరిగి చంటి పక్కనే పెట్టేసాను. సంతోషంలో, ఏదో సాధించానన్న గర్వంతో నిద్రకు ఉపక్రమించాను.తెల్లవారి మెలకువ వచ్చి లేచి చూసేసరికి పైన చంటిలేడు. అతను దిగిపోయాడు. ఎంతో నిరాశ కలిగింది.తరువాత భార్యతో కలసి రైలు దిగిపోయాను ముందు స్టేషన్లో దిగిపోయిన చంటి కేశవని, అతని భార్యకి గుర్తుపట్టినా పలకరించ లేదు.
భారత రక్షణ శాఖలో అధికారిగా పనిచేస్తున్న చంటి ముఖ్యమ్కెన రహస్య సేకరణ కోసం ఏర్పడిన కమిటీలో నియమితుడ్కెన సభ్యుడు. అ పనిమీద నిమగ్నమ్కెనప్పుడు, స్నేహితులు, బంధువులు, పరిచయాలు, ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకూడదు. తన వివరాలు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ తన కర్తవ్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. భారత పౌరుడిగా దేశాన్ని గౌరవిస్తూ, ఒక రక్షకుడిగా పనిచేస్తూ ధర్మ మార్గంలో జీవితాన్ని గడపుతూ, సంతృప్తిగా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పెద్ద ఉద్యోగంలో చాలా కాలంగా స్థిరపడ్డాడు ప్రభాకరం. తన బంధువులను ఆత్మీయంగా పలకరించలేకపోయినందుకు లోలోపల ఎంత కుమిలిపోయాడో ఎవరికి ఎరుక, ఒక్క తన మనసుకు తప్ప. ఆలోచనలతో కారులో ఇంటికి చేరువలో ఉండగానే స్వెట్టరు, మఫ్లరు అన్నీ తీసివేసి ఇంట్లో ప్రవేశించాను ఆనందంగా.చంటి చిన్నతనానికి ప్రభాకరం ప్రస్తుత పెద్ద ఉద్యోగానికి మధ్య కాలం తెచ్చిన మార్పులు ఎన్నో, ఎన్నెన్నో. ఉడతాభక్తిగా దేశం కోసం వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్న ప్రభాకరం జీవిత గమనానికి అభినందనలు అందజేద్దాం.
జై భారత్ .
– డా. దేవులపల్లి పద్మజ, విశాఖపట్టణము, 9849692414




