చేతులెత్తి మొక్కుతున్నా..

  • రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం ఆలోచన చేద్దాం
  • హుస్నాబాద్‌ ‌సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవన మరమ్మత్తు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు
హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. 50 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. రాజకీయాలు తర్వాత.. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాజకీయాల కోసం కాదు. చేతులెక్కి మొక్కుతున్నా.. రైతుల కోసం ఆలోచన చేద్దాం. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రండి. భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపునిచ్చారు.సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవన మరమ్మత్తు అభివృద్ధి, 50 పడకల ప్రభుత్వ మాతాశిశుదవాఖాన భవనానికి శంకుస్థాపన, అలాగే ఉచిత డయాలసిస్‌ ‌కేంద్రం-రక్త శుద్ధీకరణ కేంద్ర సోమవారం   రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు ప్రారంభోత్సవం చేసారు.
ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌  , ‌జెడ్పీ చైర్మన్‌ ‌రోజాశర్మ, జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ ‌ప్రభుత్వ దవాఖాన ఇక 100 పడకల దవాఖానా గా మారింది. . 2.85 లక్షలతో డయాలసిస్‌ ‌ప్రారంభం చేసుకున్నాం అని పేర్కొంటూ ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌ ‌బండ్‌ ‌కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసాం..గౌరవెల్లి ప్రాజెక్టు మిగిలిన భూ సేకరణకు రూ.23 కోట్లు మంజూరు.. ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాజకీయ నాయకులను కోరుతున్న రైతు ప్రయోజనాల కోసం కలిసి రండి అని పిలుపునిచ్చారు రాజకీయాల కోసం కాదు రైతుల కోసం ఆలోచించండి ప్రాజెక్టు పనులు అడ్డుకోవద్దు అన్ని వర్గాలు సహకరించాలి.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 3 ఏంసీహెచ్‌ ‌లకు ప్రతిపాదనలు పెట్టినట్లు వాటిలో మొదటిది హుస్నాబాద్‌. .‌తెలంగాణ రాష్ట్రం రాకముందు 3 డయాలసిస్‌ ‌కేంద్రాలు ఉండేవని, ఇవాళ 102 డయాలసిస్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం..అని తెలిపారు.
తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ
image.png
హుస్నాబాద్‌: ‌సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ మహ్మదాపూర్‌ ‌గ్రామంలో ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌, ‌జడ్పీ చైర్మన్‌ ‌రోజా శర్మతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ మహ్మదాపూర్‌ ‌ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, మహిళలకు మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు  తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌ అధినేతగా 2001 నుంచి 2009 వరకూ కొట్లాడి కాంగ్రెస్‌ ‌మోసాలపై ఎన్నోసార్లు ధ్వజమెత్తారు. తెలంగాణ నవంబర్‌ 29‌వ తేదీన ఆమరణ దీక్షకు దిగి తన ప్రాణాన్ని సైతం బలి పెట్టడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని మంత్రి పేర్కొన్నారు.
దిల్లీ సర్కారు దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసేదాకా నిరాహార దీక్ష చేసిన గొప్ప మహా నాయకుడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి చిత్తూరుకు నీళ్లు తీసుకుపోవడానికి రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిండు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ మిషన్‌ ‌భగీరథ ద్వారా మంచినీళ్లు అందించిన గొప్ప సంకల్పం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్‌. అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వైఎస్‌.‌రాజశేఖర్‌ ‌రెడ్డి హేళన చేసిన విషయాలు మర్చిపోయారా..? తెలంగాణ ఇవ్వాలంటే చాక్లెట్‌, ‌బీడీ అనుకుంటున్నారా..
అంటూ హేళన చేసిన మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు ఎవరో విడిచిన బాణాలు వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని విమర్శించారు.డా . వైఎస్‌.‌రాజశేఖర్‌ ‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం మర్చిపోయి ఇప్పుడు ఇక్కడ పాదయాత్రలు చేసి తెలంగాణను ఉద్ధరిస్తామని తెలంగాణలో తిరిగే బాణాలను తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు సీఎం కేసీఆర్‌ ఒక్కరే. ఉద్యమ సమయంలో నిరాహారదీక్ష చేపట్టి 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా తన ప్రాణాన్ని సైతం వీడేందుకు సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ ‌కు తెలంగాణ మీద ప్రేమ ఉంటదా..లేక నరేంద్ర మోడీకి ప్రేమ ఉంటదా.? అంటూ రెండు కళ్ళ సిద్ధాంతాల చంద్రబాబు నాయుడుకు ప్రేమ ఉంటదా అని సూటిగా ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *