చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మల్కాజిగిరి లోని బండ చెరువు, ఆర్.కే.పురం చెరువులను సోమవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు రాజ్యలక్ష్మితో కలిసి పరిశీలించారు. చెరువు పరివాహక కాలనీల ప్రెసిడెంట్ లతో కలిసి ఇరిగేషన్, పురపాలక, హెచ్.ఎం.డి.ఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులో గుర్రపు డెక్క, దోమల నివారణ చెరువుల సుందరీకరణ తదితర అంశాలపై అధికారులతో మాట్లాడి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు పోవాలని ఆదేశించారు. ఇక్కడి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మీన ఉపేందర్ రెడ్డి, సునీత రాము యాదవ్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *