చెరువుని చెరబట్టారా : చెరువును వందల టిప్పర్ల మట్టితో నింపిన వైనం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 27: అది పదివేల జనాభా కలిగిన గ్రామానికి ఒకనాడు తాగునీరు, సాగునీరు అందించిన చెరువు మండు వేసవిలో సైతం గ్రామానికి అంతటికి వుటాబావిలా పనిచేసిన ఆ చెరువు నేడు కబ్జాకు గురై వందల ట్రిప్పుల మట్టితో నిండిపోయింది రాత్రికి రాత్రి చెరువులో మట్టి పోసి ఆ చెరువును పుడ్చేస్తున్నరు కాపాడవలసిన నాయకులు అమ్ముడుపోయి వాటాదారులుగా మిగిలిపోయారు సంరక్షించవలసిన అధికారులు పర్యవేక్షణకు కరువై కనిపించకుండా పోయారు.చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చెరువు మట్టితో నిండిపోయిన అనంతరం అధికారులు రావడం పూర్తి వివరాల్లోకి వెళితే….జగదేవపూర్ గ్రామంలో గల రెడ్డబోయిన చెరువు (బతుకమ్మ చెరువు) పూర్తి విస్తీర్ణం 18 ఎకరాలు గత కొన్ని సంవత్సరాల నుండి ఆ చెరువు దినదినం కబ్జాకు గురి అవుతూ చెరువులో మట్టి నింపుతూ రియల్ దందాకు నిలవుగా మారింది. ఈ మధ్యనే 726.727.728. సర్వే నంబర్ల లో ప్లాట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం వందల ట్రిప్పుల మట్టిని చెరువులో నింపడం జరిగింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు బుధవారం నాడు చెరువును పరిశీలించి ఎఫ్ టి ఎల్ లో మట్టితో నింపినట్లు గుర్తించారు. మట్టిని వెంటనే తొలగించాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం: డి. ఈ చంది రామ్
జగదేవపుర్లో గల రెడ్డబోయిన చెరువు 18 ఎకరాలలో విస్తీర్ణం కలిగి ఉందని అదేవిధంగా చెరువుకు రెండు దిక్కుల నుంచి రావలసిన కట్టు కాలువలను సైతం కబ్జా చేయడం జరిగిందన్నారు. ఈ చెరువు చుట్టూరా ఉన్న ఎఫ్ టి ఎల్ భూముల్లో పట్టాదారులు మట్టితో నింపి అమ్మకానికి పెట్టడం జరిగిందన్నారు. ఎఫ్ టి ఎల్ భూములు పట్టా కలిగి ఉన్నప్పటికీ అందులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలుండదన్నారు. చెరువులో మట్టి బోసి చెరువును పుడుస్తున్న వారిపై జగదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు.పోసిన మట్టిని తొలగించాలని చెరువుకు పూర్వ స్థితి కల్పించాలని కోరారు.
ఇంత జరుగుతున్న నోరు మెదపని నాయకులు
జగదేవపూర్ పట్టణంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే చిన్నచిన్న గ్రామాలలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయని కబ్జాకు గురవుతున్న భూముల్లో నాయకులకు వాటాలు అందుతున్నాయని అందుకే ఇలాంటి కబ్జాలు నాయకలకు బంగారు బాతులా మారాయని అందుకే నాయకులు నోరు మెదపడం లేదని ప్రజలు వపోతున్నారు.
అది మా పని కాదంటే ఒకరిపై ఒకరు బురద జల్లుకునే అధికారులు
చెరువులు కబ్జాకు గురై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డాలుగా మారుతుంటే అధికారులు మాకు ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకోవడమే కాకుండా చెరువులను కాపాడవలసిన బాధ్యత ఐబి అధికారులదని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తెలుపుతుండగా హద్దులు చూపెట్టవలసిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటూ హైవే అధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకరిపై ఒకరు బురద జల్లుకునేది తప్ప బాధ్యతగా పనిచేసిన దాఖలాలు కనిపించడం లేదంటూ ప్రజలు అధికారుల తీరుపై ముక్కున వేలేసుకుంటున్నారు చెరువును పరిశీలించిన అధికారుల్లో ఇరిగేషన్ శాఖ ఎఈ అరుణ్ కుమార్ రెవెన్యూ శాఖ ఆర్ఐ నాగరాజు పోలీస్ శాఖ కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *