చెమట చుక్క రాల్చకుండా…పైసా ఖర్చు లేకుండా ..

జూబ్లీహిల్స్ ‌స్థాయిలో ఇండ్లను పొందిన మీరు అదృష్టవంతులు
శివుడు నెత్తిమీద గంగను పెట్టుకున్నట్టు కేసీఆర్‌ ‌పాములపర్తి వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌కట్టిండు
తిన్నింటి రేవు తలవాలి
పాములపర్తిలో సర్కార్‌, ‌కావేరి ఫౌండేషన్‌ ‌సౌజన్యంతో నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల
ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు

ఒక చెమట చుక్క కూడా రాల్చకుండా… ఒక పైసా ఖర్చు పెట్టకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ‌స్థాయిలో కావేరి సీడ్స్ ‌చారిటబుల్‌ ‌సౌజన్యంతో నిర్మించిన ఇండ్లను పొందిన మీరు చాలా అదృష్టవంతులు అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వగా మరో 11 లక్షల 50 వేల రూపాయలు ఖర్చు చేసి కావేరి సీడ్స్ అధినేత భాస్కర్‌రావు అద్భుతంగా 35 ఇండ్లను నిర్మించి ఇచ్చారన్నారు. ఇండ్ల నిర్మించిన కేసీఆర్‌కు, కావేరి భాస్కర్‌రావుకు లబ్ధిదారులు రుణపడి ఉండాలన్నారు. సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ ‌మండలంలోని పాములపర్తిలో కేసీఆర్‌ ‌కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కావేరి భాస్కర్‌రావు(కావేరి సీడ్స్)‌చారిటబుల్‌ ‌ఫౌండేషన్‌ ‌సౌజన్యంతో నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను శనివారం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించి లబ్ధిదారులతో గృహాప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌యాదవరెడ్డి, కావేరి సీడ్స్ ‌ఛైర్మన్‌ ‌భాస్కర్‌రావు, డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డి, డిసిసిబి డైరెక్టర్‌ ‌బట్టు అంజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మర్కూక్‌ ఎం‌పిపి పాండుగౌడ్‌, ‌వంటిమామిడి ఏంఎసి ఛైర్మన్‌ ‌జహంగీర్‌, ‌గజ్వేల్‌ ఏఎం‌సి ఛైర్మన్‌ ‌మాదాసు శ్రీనివాస్‌, ‌ములుగు డివిజన్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌గూండా రంగారెడ్డి, జడ్పిటిసి యెంబరి రామచంద్రం, బిఆర్‌ఎస్‌ ‌నేతలు కరుణాకర్‌రెడ్డి, దుంబాల లింగారెడ్డి అలియాస్‌ ‌టింకు, హన్మంతరావు అలియాస్‌ ‌హరి పంతులు, పిట్ల సత్యనారాయణ, నూనె కుమార్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి త•దితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… తిన్నింటి రేవు తలవాలనీ, ఏ అవ్వను అడిగినా సిఎం కేసీఆర్‌ ‌పెద్దకొడుకు ఉండగా మాకేం బాధ అంటున్నారన్నారు. గతంలో గజ్వేల్‌ ‌ప్రాంతంలో గతుకుల రోడ్లతో కనీసం ఆర్టీసీ బస్సులు ఆటోలు అచ్చే పరిస్థితి లేకుండేదనీ, సిఎం కేసీఆర్‌ ‌రాకతో ఇప్పుడు గతుకుల గజ్వేల్‌ ‌బతుకుల గజ్వేల్‌ అయిందిదన్నారు. శివుడు నెత్తిమీద గంగను పెట్టుకున్నట్టు సిఎం కేసీఆర్‌ ‌పాములపర్తి మీద కొండపోచమ్మ రిజర్వాయర్‌ను పెట్టిండన్నారు. కేసీఆర్‌ ‌కాలేశ్వరం ప్రాజెక్టును అపర భగీరథుడిగా తీసుకువచ్చిండనీ, పాండురంగ స్వామి ఆశీస్సులతో •కేసీఆర్‌ ‌గ•జ్వేల్‌కు రావడం గజ్వేల్‌ ‌ప్రజల అదృష్టమన్నారు. ఆనాడు పని దొరకని పల్లెల బ్రతుకుల నుండి నేడు పంట పొలాలలో కూలీలు దొరకక చతీస్‌ఘడ్‌ ‌మగ కూలీలు వచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. భూమికి బరువయ్యేంత పంట పండి పక్క రాష్ట్రాలకు బువ్వ పెట్టే స్థాయికి కేసీఆర్‌ ‌తెచ్చిండనీ, పక్క రాష్ట్రం కర్ణాటక వాళ్లు మన బియ్యం అడుగుతున్నారన్నారు. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పేదల బతుకు మారలేదు. కానీ, పేదల బతుకు మార్చిన నేత కేసిఆర్‌ అని, ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానక• అనే కాడి నుండి నేడు సర్కారు దావకానకే వెళ్తా అనే విధంగా ప్రభుత్వ దవాఖానలను బాగు చేసుకున్నామన్నారు. గజ్వేల్‌లో మరో 40 కోట్ల రూపాయలతో 150 పడగల మాత, శిశు సంరక్షణ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుంటున్నామనీ, నెలరోజుల్లో ప్రారంభం కానుందన్నారు. కేసీఆర్‌ ‌తల్లి మనసుతో కేసీఆర్‌ ‌న్యూట్రీషన్‌ ‌కిట్‌ను తీసుకువచ్చారనీ, బిడ్డ బయటకు వచ్చాక •కేసీఆర్‌ ‌కిట్‌ ‌పనిచేస్తే, బిడ్డ కడుపులో పడగానే తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణకు కేసీఆర్‌ ‌న్యూట్రీషన్‌ ‌కిట్టు, గృహాలక్ష్మీ పథకం మహిళల పేరు మీదనే ఇస్తామన్నారు. బిడ్డ కడుపులో పడగానే న్యూట్రీషన్‌ ‌కిట్స్‌తో ప్రారంభమై కేసీఆర్‌ ‌కిట్‌, అం‌గన్‌వాడి, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ ‌విద్యాలయాలు, కళ్యాణక్ష్మీ ఇలా బిడ్డ ఎదుగుదలలో ప్రతి చోటా కేసీఆర్‌ ‌ప్రభుత్వం తన పథకాలతో చేయూతనిస్తోందనీ మంత్రి హరీష్‌రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *