జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అన్ని అంగులతో నూతన సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనంను రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించుకుంటామని ఎంపీపీ బాలేశం గౌడ్ తెలిపారు. జగదేవపూర్ మండల కేంద్రంలో సుమారుగా 10 కోట్ల రూపాయిలు ప్రహరీకి మరికొన్ని నిధులతో ఐఓసి భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతు చివరి దశకు చేరుకున్నాయని అన్నారు. భవనంలో కలర్లు కరెంట్ పనులు భవనం చూటూ ప్రహరీ నిర్మాణం లోపల బయట ప్రారంభానికి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చెస్తూన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.గజ్వేల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయిల నిధులతో సమీకృత మండల కార్యాలయ భవనాలను ఏర్పాటు చేయడం అబినందనీయమని సిఎం కేసిఆర్ కు మేము రుణపడి వుంటమని పేర్కొన్నారు. మండలాల్లోని ఐఓసి నూతన భవనాలను వారం పది రోజుల్లో నే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.




