పుట్టుకతోనే
ప్రతి క్షణం –
మరణిస్తున్నాం!
మృత్యువు ప్రతీ క్షణం
ఒక్కో క్షణాన్ని
మింగేస్తూనే వుంది …
దాని తుది అఘాతమే
మరణం!
పుట్టుట – పెరుగుట
కొంతకాలం ‘స్థితి’ని
కలిగి ఉండుట …
ఏవేవో సృష్టించుట –
క్షీణించుట …
చివరకు నశించుట!
ఇదంతటికి మూలం…
జన్మించుట…
..అనే తొలి
ఉద్భవంతో …
కర్మానుసారం మొదలయ్యే
జీవిత ప్రయాణంలో …
చివరకి మిగిలేది ?
అంతా శూన్యం !!!
-న్యాలకంటి నారాయణ
9550833490



