పటాన్చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ప్రయోగశాలలో ఎలుకలు, చుంచులు వంటి జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఈనెల 20-21 తేదీలలో కార్యశాలను నిర్వహించనున్నారు. లాబొరేటరీ యానిముల్ సెంటిస్ట్స్ అసోసియేషన్ (ఇండియా), ఐపీఏ స్టూడెంట్స్ ఫోరమ్‌తో కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నారు.బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను నిర్వహణ ప్రాథమిక పద్ధతులపై ఇందులో పాల్గొనేవారికి అవగాహన కల్పించడం ఈ కార్యశాల లక్ష్యం. అంతేగాక, జంతువుల లింగ నిర్ధారణ, నియంత్రణ వంటి నెపుణ్యాలను నేర్చుకునే వీలుంటుంది. ద్రవం ఉపసంహరణ, డ్రగ్/టెస్ట్ కాంపౌండ్ నిర్వహణకు సంబంధించిన మెళకువలను నేర్చుకుంటారు. ఆయా అంశాలపై నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలతో సదస్యులు ముఖాముఖి చర్చించే అమూల్యమైన అవకాశం ఉంటుంది.హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ డీన్ డాక్టర్ ప్రకాష్ బాబు ఫణితి ఈ కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ‘క్యాన్సర్ చికిత్స కోసం ఔషధ ఆవిష్కరణలో ఆధునిక పోకడలు అనే అంశంపై ప్రసంగిస్తారు. హైదరాబాద్ లోని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.జెరాల్డ్ మహేష్ కుమార్, హెదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పూర్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్. హరిశంకర్ ప్రధాన వక్తలుగా పాల్గొంటారు.ఈ కార్యశాలలో లెఫ్ట్ సెన్సైస్, ఫార్మసీ రంగంలో పరిశోధనలు చేసే వారితో పాటు ఫార్మసీ, బయాలజీ, మెడికల్ సెన్సైస్ విద్యార్థులు కూడా పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనేవారు.ఆయా రంగంలో వారి అవగాహన, నెపుణ్యాలను పెంపొందించే విలువెన అంతర్గత, ఆచరణాత్మక నెపుణ్యాలను పొందుతారు.
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనాలనే ఆసక్తిగల వ్యక్తులు తమ పేర్ల నమోదు, రుసుము వంటి మరిన్ని వివరాల కోసం డాక్టర్ ఎం.వినయాసిని 9949 123 037లో సంప్రదించవచ్చు, లేదా vmayasa@gitam.edu కు ఈ-మెయిల్ చేయవచ్చు.





