చిత్రసీమలో కైకాలది ప్రత్యేక స్థానం – కెసిఆర్‌

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణకు సిఎం కెసిఆర్‌ ‌ఘనంగా నివాళి అర్పించారు.  శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ ‌నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఓదార్చారు. నివాళులర్పించిన అనంతరం కేసీఆర్‌ ‌డియాతో మాట్లాడారు. సినీనటులు కైకాల సత్యనారాయణ చాలా విలక్షణమైనటువంటి నటుడు. హీరోకున్న గ్లామర్‌ ‌సత్యనారాయణకు ఉంది. ఏ పాత్ర ఇచ్చిన కూడా సజీవంగా జీవిస్తూ నటించి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు.

కైకాల ఎంపీగా పని చేసిన కాలంతో ఆయనతో కొన్ని అనుభావాలు కూడా పంచుకున్నాం. కొంతకాలం మేమంతా కలిసి కూడా పని చేశాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్‌ ‌నటుడిని కోల్పోవడం చాలా బాధాకరం. సత్యనారాయణ లోటును ఎవరూ కూడా పూడ్చలేరు. ఆయనకు సమానమైన నటులు కూడా ఇప్పుడు లేరు. ఆయన పోషించిన పాత్రలు అద్భుతం అంటూ కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కెసిఆర్‌ ‌వెంట మంత్రులు, బిఆర్‌ఎస్‌ ‌నేతలు పలువురు ఉన్నారు. వారు కూడా కైకాలకు నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *