‘‘నాగపూర్ విశ్వవిద్యాలయ ఎంఏ కోర్సులో వామపక్ష పార్టీలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను సిలబస్ నుంచి తొలగించి 1980-2000 మధ్యకాలంలో ప్రజా ఉద్యమాల పేరుతో బీజేపీ మరియు రామ మందిర ఆందోళనల్ని పాఠ్యంశంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదేమని కొందరు మేధావుల నుండి ప్రశ్న ఎదురైనప్పుడు ఉభయ వామాపక్ష పార్టీలు తమ జాతీయ హోదా కోల్పోయిన కారణంగానే తొలగించినట్టు పేర్కొనండంతో పాటు విద్యార్థులకు తప్పుడు చరిత్రను భోదించలేం కదా అంటూ సమాధానం ఇవ్వడం మరెన్నో న్యాయబద్ధమైన ప్రశ్నలకు తావిస్తోంది.’’
గత తొమ్మిదేళ్లుగా చరిత్రను తమ హిందూ సామ్రా జ్యవాద భావజా లానికి అనుకూ లంగా మార్చు కోవడానికి కాషాయ దండు తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగిం చుకుంటూ దూర్మార్గమైన పంధాలో ముందుకు సాగు తూనే ఉన్నది.బడి పుస్తకాల నుంచి విశ్వ విద్యాలయ సెమిస్టర్ కోర్సు పేపర్ల దాకా దేన్నీ వదలకుండా సైద్ధాంతిక పద్ధతిలో ఓ భీకరమైన దాడికి దిగుతోంది.ఇటీవల నాగపూర్ విశ్వ విద్యాలయ ఎంఏ కోర్సులో వామపక్ష పార్టీలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను సిలబస్ నుంచి తొలగించి 1980-2000 మధ్యకాలంలో ప్రజా ఉద్యమాల పేరుతో బీజేపీ మరియు రామ మందిర ఆందోళనల్ని పాఠ్యంశంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదేమని కొందరు మేధా వుల నుండి ప్రశ్న ఎదురైనప్పుడు ఉభయ వామాపక్ష పార్టీలు తమ జాతీయ హోదా కోల్పోయిన కారణంగానే తొలగించినట్టు పేర్కొనండంతో పాటు విద్యార్థులకు తప్పుడు చరిత్రను భోదించలేం కదా అంటూ సమాధానం ఇవ్వడం మరెన్నో న్యాయబద్ధమైన ప్రశ్నలకు తావిస్తోంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నిషేదించబడి,తొలి ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేత ఓ ప్రమాదకరమైన సంస్థగా పేర్కొనబడ్డ ఆరెస్సెస్ గురించి పాఠాల్లో ఎందుకు చేర్చినట్టు? లౌకిక తత్వాన్ని అనుసరిస్తున్న దేశంలో ఈ దేశం హిందువులదే అని చెప్పే అతివాద భావజాలం ఉన్న ఆరెస్సెస్ నుంచి విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? సిలబస్ మార్పుల అంశంలో బీజేపీ ఎంత సంకుచిత కోణంలో ఆలోచించింది అంటే తమిళనాడు రాష్ట్రంలో తన మిత్రపక్ష ఏఐడీఎంకేని సిలబస్ లో ఉంచి డీఎంకేని తొలగించింది.
ఢల్లీి విశ్వవిద్యాలయ పరిధిలో బీఏ కోర్సులో అంబేద్కర్, మహ్మద్ ఇక్బల్ అంశాలను తొలగించే నిర్ణయం తీసుకు న్నట్టు వార్తల్ని విన్నాం.ఒకరు భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆధునిక భారత పితామహునిగా ఖ్యాతినొందగా ఇంకొకరు పాకిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఆలోచనలు తమ రచనల్లో చెప్పిన వారు.ఇక్బల్ సంగతి అలా ఉంచితే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీద వాళ్లకి ఎందు కింత కక్ష అన్నది మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.సర్వ మానవ సౌబ్రాతృత్వం,మహిళల్ని గౌరవి ంచడం మరియు వారిని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించడం వంటివి అంబేద్కర్ చెప్పిన ఆధునిక ప్రగతిశీల ఆలోచనలు.మరి మత తత్వాన్ని,కులాన్ని మహిళా వ్యతిరేక దొరణుల్ని తమ ఆణువణువునా నింపుకున్న ప్రగతి విరోధ శక్తులు ఆ ప్రగతి సూత్రాల్ని ఆమోదించగలవా? అన్ని వర్గాల వాళ్ళు పరస్పర సహనంతో జీవిస్తే జీర్ణించుకోగలవా?వారు అంబేద్కర్ ఆలోచనలను ద్వేషంచడానికి గల ఇంకా వేర్వేరు కారణాల్ని హేతుబద్ధంగా ఆలోచించే పనిని మీకే వదిలేస్తున్న.
గతంలో ఓ కాలేజీ యువకున్ని పాఠాలు భోదించాల్సిన గురువే ముంబయి అల్లర్ల కేసులో ఉరిశిక్ష పడిన ఆగంతకుడు కసబ్ తో పోల్చడం అసహనం ఎక్కడికి వెళ్లిందో మనమే వివేచన చేయాలి. ముస్లిం పిల్లవాణ్ణి సాటి పిల్లలతో కావాలనే కొట్టించిన దూ ర్మార్గమైన సంగతి మనం ఈ మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చూసి ఉన్నాము.ఆరెస్సెస్ మరియు భారత సంస్కృతి పేరుతో కొన్ని కట్టు కధల్ని భోదించమని, పాఠ్య పుస్తకాల్లో చేర్చమని అధ్యాపకులు,విభాగధిపతుల మీద జరుగుతున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు.యూజీసి నిబంధనల ప్రకారం 20% సిలబస్ మార్పులకు అనుగుణంగా నిభందనలు ఉండగా తాము నమ్మిన సిద్ధాంతాల్ని పుస్తకాల్లో చేర్చే విధంగా కీలక స్థానాల్లో తమ అనుకూల భావజాలం ఉన్నోళ్ళని పెట్టుకోవడం గత తొమ్మిదేళ్లలో అమలవుతున్న దుర్మార్గమైన ఆనవాయితీ. నూతన పాఠ్య పుస్తకాల రూపాకల్పన కమిటీ సభ్యుల వివరాల్ని, వారికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంభందాల్ని తరచి చూస్తే నా ఆరోపణలు మీకు స్పటిక సదృశ్యంగా గోచరిస్తాయి. అన్యమతాల పట్ల వీరి అసహనం ఏ స్థాయికి చేరింది అంటే మధ్య ఆసియా నుంచి వచ్చిన బాబర్ గురించి భారతదేశంపై దండయాత్ర అని పేర్కొని బ్రిటిష్ వలస పాలనని వలస ప్రాంతాల విస్తరణ అని పేర్కొని తమ యొక్క భావ దారిద్య్రం నిరూపించుకున్నారు.
1857 సిపాయిల తిరుగుబాటు అంశాన్ని ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని పేర్కొని తమ గురువు సావర్కర్ ఆత్మకు శాంతి చేకూర్చారు.గుజరాత్, హర్యానా,ఉత్తరఖాండ్ మరియు కర్ణాటక బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల పాఠ్య పుస్తకాల్లో గణనీయమైన మార్పులు చేసి రాజభక్తి నిరూపించుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం పెరియార్, నారాయణ గురు మరియు భగతసింగ్ ని తమ పాఠ్య పుస్తకాల నుంచి తీసివేయగా తక్కిన మూడు రాష్ట్రాలు భగవద్గీతను చేర్చాయి.వేదాలు, ఉపనిషత్తులు వంటివి నూతన విద్య విధానం ప్రకారం చేర్చామని ఉత్తరఖాండ్ విద్యమంత్రి ధన్ సింగ్ రావత్ సెలవిచ్చారు. ఆయనతో పాటు ఆయన వెనక ఉన్న కాషాయ బలగానికి ఈ దేశ యువత నుండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కొత్త విద్యా విధానం ప్రకారం కోడిరగ్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ లాంటివి పుస్తకాల్లో చేర్చాకూడదా? అవి చేరిస్తే అన్ని కులాల, వర్గాల వాళ్ళు చదువుకుంటారని భయమా? చదివితే స్వేచ్ఛ సమానత్వం అనే భావన మాట్లాడి అన్ని రంగాల్లో వాటా అడుగుతారని భయమా? మతమనే మానసిక బంధికానా నుంచి బడుగులు తుర్రున ఎగురు తారని భయమా? ఎగిరి మీ సింహాసనల్ని ఆక్రమి స్తారని భయమా? అంతా సమానమైతే అసమానత నిచ్చెన మీద మీ పై స్థానం కిందకి జారుతుందని భయమా?
పిల్లుట్ల నాగఫణి




