మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన కొందరు బ్రాండ్ అంబాసిడర్లలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఒకరు. తెలంగాణ ప్రజల నాడిని ఆయన పసిగట్టినట్లుగా ఇతర రాజకీయనాకులెవరూ పసిగట్టలేరు. కానీ చంద్రశేఖర్ రావు. .కేసీఆర్ ..తెలంగాణ ప్రజల హృదయాన్ని తెలుసుకోలేక పోయారు. రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి …ప్రజా సంక్షేమ పథకాలపై ఆయన దృష్టి పెట్టినా…ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా పాలన కొనసాగించారు. దాని పర్యవసానంగా 2014లో రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా, మళ్ళీ 2018లో కెసిఆర్‌కు, ఆయన పార్టీ భారత రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చిన ప్రజలు 2023లో తిరస్కరించారు. దాంతో పార్టీ అధికారం కోల్పోయింది..కేసీఆర్ ముఖ్యమంత్రి పదవీ పోయింది.
2024, ఫిబ్రవరి 17కు కె.చంద్రశేఖర్ రావు ఏడు పదులు దాటనున్నారు. ఈ డెబ్బ్కె సంవత్సరాల ఆయన జీవిత కాలంలో 50 సంవత్సరాలు ప్రజల సమస్యల నడుమ ..రాజకీయాలతో కొనసాగింది. యూత్ కాంగ్రెస్ సభ్యునిగా ప్రారంభమయిన కేసీఆర్ రాజకీయ ప్రయాణంలో ఆయన రాష్ట్రంలో పలు చోట్ల నుంచి చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించారు. 1985లో మొదటిసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆ తరువాత వరుసగా 1989, 94, 99 మరియు 2001 ఉప ఎన్నికల్లో అదే నియోజక వర్గం నుంచి ఎమ్మెలేగా ఎన్నికయ్యారు. ఈ మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా, ఉప సభాపతిగా పదవులు చేపట్టారు. కరీంనగర్ నుంచి రెండు సార్లు(2004, 2006), మహబూబ్ నగర్ నుంచి 2009 లో ఒక సారి లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా కొంత కాలం బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో గజ్వెల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు చట్ట సభలు దేవాలయాలు..మందిరాలు..రాజ్యాం
తన మెదడును కరిగించి డిజ్కెన్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, అవినీతిపై తీవ్ర విమర్శలు, విచారణ కూడా కొనసాగుతున్నది. దానికి వివరణతో సహా ప్రజలకు నిజాలు చట్ట సభ ద్వారా తెలియయజేయాల్సిన బాధ్యత ఒక ప్రజా ప్రతినిధిగా కెసిఆర్‌పై ఉన్నది. అయినా ప్రతిపక్ష నాయకుని హోదాలో శాసన సభ సమావేశాలకు మాజీ ముఖ్య మంత్రి హాజరు కావడం లేదు. మంగళవారం నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్న కొందరినుద్దేశించి మాట్లాడుతూ ..ఇది మన సభ ..చట్ట సభ కాదు అంటూ తనకు 50 సంవత్సరాలుగా రాజకీయ భిక్ష, అధికారాన్ని ఇచ్చిన చట్ట సభలను అపహాస్య పరచడమే కాదు..ఆయనకు రాజ్యాంగ విలువల పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుతుంది.





