హైదరాబాద్, పిఐబి, జూలై 14 : చంద్రగ్రహానికి భారతదేశం చేపట్టిన మూడో లూనర్ మిశన్ ‘చంద్రయాన్-3’ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి తన వివిధ ట్వీట్‌లలో – ‘‘భారతదేశం యొక్క అంతరిక్ష రంగం గురించి ప్రస్తావించవలసి వస్తే, 2023 జులై 14 వ తేదీని సదా సువర్ణాక్షరాలతో లిఖించడం జరుగుతుంది. మన మూడో చంద్ర గ్రహ సాహస యాత్ర అయినటువంటి చంద్రయాన్-3 తన ప్రస్థానానికై బయలుదేరనుంది. ఈ ప్రశంసనీయమైనటువంటి మిశన్ మన దేశ ప్రజల ఆశలను మరియు స్వప్నాలను ముందుకు తీసుకు పోతుంది. కక్ష్యలోకి పంపే ప్రక్రియ తరువాత చంద్రయాన్-3 ను లూనార్ ట్రాన్స్ ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. 3,00,000 కిలో మీటర్‌ల పై చిలుకు దూరాన్ని దాటి ఇది రాబోయే కొన్ని వారాలలో చంద్రుడిని చేరుకొంటుంది.
చంద్రయాన్‌కు అమర్చినటువంటి వైజ్ఞానిక ఉపకరణాలు చంద్రగ్రహం ఉపరితలాన్ని అధ్యయనం చేయడం తో పాటు మన జ్ఞానాన్ని పెంపొందింప చేస్తాయి. మన శాస్త్రవేత్తల చలవతో, అంతరిక్ష రంగంలో భారతదేశం యొక్క ఇతిహాసం చాలా సమృద్ధమైందిగా ఉంది. చంద్రయాన్-1 ని ప్రపంచంలో చంద్ర గ్రహం తాలూకు మిశన్స్‌లో ఒక మార్గదర్శి అని భావించడం జరుగుతున్నది. ఎందుకంటే అది జాబిల్లి ఉపరితలం పైన జల సంబంధి అణువులు ఉన్నాయి అని రూఢిపరచింది. ప్రపంచమంతటా 200 కు పైచిలుకు విజ్ఞానశాస్త్ర సంబంధి ప్రచురణలలో దీనిని గురించిన ప్రస్తావన ఉంది. చంద్రయాన్-1 కి పూర్వం, చంద్ర గ్రహం పూర్తిగా ఎండిపోయినటువంటిది అని, భౌగోళిక పరంగా నిష్క్రియం మరియు నిర్జన ఖగోళ పిండమని నమ్మేవారు. ఇక, దీనిని జలం ఉనికి కలిగినటువంటి మరియు అనుబంధ పొరలలో మంచు ఆనవాళ్లతో పాటు ఒక గతిశీలమైనటువంటి మరియు భౌగోళికంగా అది ఒక చురుకైన ఖగోళీయ ఖండమని లెక్కకు తీసుకోవడం జరుగుతోంది. బహుశా భవిష్యత్తులో దీని పైన నివాసాలను ఏర్పరచుకోవడమనేది సాధ్యం కావచ్చు! చంద్రయాన్-2 కూడా అంతే ముఖ్యమైందిగా ఉండింది.
ఎందుకంటే దీనికి జోడించిన ఆర్బిటర్ నమోదు చేసినటువంటి డేటా తొలి సారి రిమోట్ సెన్సింగ్ మాధ్యం ద్వారా క్రోమియమ్, మేంగనీజ్ మరియు సోడియమ్ ఉనికిని పసిగట్టింది. ఇది చందమామ యొక్క మేగ్మేటిక్ వికాసం గురించిన సమాచారం మరింతగా తెలియగలదు. చంద్రయాన్ యొక్క ప్రముఖ వైజ్ఞానిక పరిణామాలలో చంద్ర గ్రహం మీద సోడియం తాలూకు తొలి ప్రపంచ మానచిత్రం, క్రేటర్ ఆకారాల సమూహం తాలూకు అధిక సమాచారం, ఐఐఆర్‌ఎస్ ఉపకరణం అండ తో చంద్రుని ఉపరితలం మీద నీటి తో ఏర్పడిన మంచు యొక్క స్పష్టమైన రూపు ను వెదకడం మరియు ఇంకా ఎన్నో అంశాలు భాగం గా ఉన్నాయి. ఈ మిశను ను గురించి ఇంచుమించు 50 ప్రచురణలలో వివరించడం జరిగింది. చంద్రయాన్-3 మిశన్‌కై ఇవే శుభాకాంక్షలు. ఈ మిశనును గురించి, మరి అలాగే అంతరిక్షం, విజ్ఞానశాస్త్రం, ఇంకా నూతన అన్వేషణ..వీటిలో దేశం సాధించిన ప్రగతిని గురించి మరింత ఎక్కువగా విషయాలను తెలుసుకోవలసిందంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనితో మీ అందరికి బోలెడంత గర్వం కలుగుతుంది.’’ అని పేర్కొన్నారు.



