జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: జగదేవపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర రాము ఆధ్వర్యంలో కేక్ కట్ చెసి ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడం జరిగిందని తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికై సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రతి మహిళకు బస్సు ఫ్రీ అదే విధంగా 10 లక్షల ఆరోగ్య భీమా అమలు చేసి సంతకం చేశారాని మిగతా నాలుగు గ్యారంటీలు కూడా 100 రోజుల లోపు పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.దొరల పాలన నుండి ప్రగతిభవన్ ను ప్రజా దర్బార్ పాలనగా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కి ధన్యవాదములు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో అజిజ్, పాషా, గుబ్బ శ్రీనివాస్,దయానంద్ రెడ్డి, శ్రీరాములు, దండే వెంకటేష్, చిరంజీవి,దోమ ఐల్లయ్య, కొరమైన రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు





