ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 02: స్వాతంత్ర సమరయోధుడు, జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో  ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్  గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వతంత్ర సమరయోధుడు,జాతి పిత మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గంలో యువత నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ సాధక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచయ్య, పంచాయతీ కార్యదర్శి మునిరుద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకయ్య, లక్ష్మయ్య,వార్డు సభ్యులు,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *