తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో దసరా పండుగ వేడుకలు సోమ వారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ దసరా పండుగ వేడుకలకు మంత్రి మహేందర్రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యారు. అనంతరం శమీ వృక్షం వద్ద మంత్రి మహేందర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి లు పూజలు నిర్వహించారు. రావణ దహనం కార్య క్రమం నిర్వహించారు. ఇంతకుముందు భవానీ మాత ఆలయం లో ( బోనమ్మ గుడిలో )ప్రత్యేక పూజలు చేసిన ఆనంతరం మంత్రి, ఎమ్మెల్యే లు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు .ప్రజలు శుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం లో రెండేళ్ల లోనే రూ. 1679 కోట్లు మంజూరు చేసి తాండూరును అభివృద్ధి చేసినట్లు తెలిపారు.రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. హిందూ ఉత్సవ సమితికి తన పూర్తి సహకారం ఉంటుందని ఈ సంద్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమల్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు శోభారాణి, బీ ఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సంపత్ కుమార్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ పలు కుల సంఘాల నాయకులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దసరా పండుగ వేడుకలు





