- రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీకి ఆహ్వాన
- మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు
- అవసరమయిన సన్న బియ్యం రాష్ట్రంలోనే సేకరణ…500 బోనస్
- నఖిలీ విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు
- ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ. 600 కోట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు
- రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : జూన్ రెండున రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ఉత్సవాలకు కాంగ్రెస్ ప్రధాన నేత సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిం ది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి ప్రశీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయినందున జూన్ రెండున దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నర్ణయించినట్లు వెల్లడిర చారు. ఉత్సవాలకు కాంగ్రెస్ ప్రధాన నేత, రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ చైర్‌పర్సన్‌గా ప్రధాన పాత్ర పోషించిన సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇక అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎంఎస్‌పికే కొనుగోలు చేయాలని, ఒక్క రూపాయి కూడా తక్కువగా చెల్లించకూ డదని నిర్ణయించింది. నేటి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సబ్‌కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని మంత్రులు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు పక్రియ సాఫీగా కొనసాగేందుకు కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరాఫరా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, రాష్ట్రానికి అవసరమయిన సన్నబియ్యాన్ని రాష్ట్రంలోనే సేకరించాలని, సేకరించిన ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ చెల్లించాలని నిర్ణయించారు.
నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రైతులు లూజు విత్తనాలు కొనొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మరోవైపు విద్యకు పెద్దపీట వేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్ల నిర్వహణ చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయించిందని మంత్రలు వెల్లడిరచారు. పాఠశాలలు పున:ప్రారంభమయ్యే జూన్ 12 లోగా విద్య వ్యవస్థలో మార్పులు చూపించాలని కెబినెట్ నిర్ణయించిందని ఆయన వెల్లడిరచారు. ఇక ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ. 600 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇక డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల కనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయిన మరమ్మత్తులు చేపట్టాలని కేభినెట్ భేటీ నిర్ణయించింది. భేటీలో మేడిగడ్డపై ఎన్‌డిసిఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై కూడా చర్చించినట్లు మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడిరచారు. మొత్తంగా కాళేశ్వరం విషయంలో ఎన్‌డిసిఏ సూచనలకనుగుణంగా చర్యలు చేపడతా మని వారు స్పష్టం చేశారు. అయితే మేడిగడ్డకు మరమ్మత్తులు చేపడితే సరి అవుతుందనే గ్యారంటీ లేదని, నీరు నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్‌డిసిఏ కమిటీ స్పష్టం చేసిందని, అందుకే తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా రైతులకు నీరందివ్వాలనే ఆలోచన తమకుందని మంత్రుల వెల్లడిరచారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.





