ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని పండుగ సాయన్న విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ఆధ్వర్యంలో కోరివి కృష్ణ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం ఐక్యమత్యం అభివృద్ధి కోసం కొరివి కృష్ణస్వామి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘమభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని అన్నారు.రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు  కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు జయమ్మ మండల ముఖ్య సలహాదారుడు రిపోర్టర్ బలరాం ముదిరాజ్ యూత్ విభాగం మండల ప్రధాన కార్యదర్శి బాలకిషన్ ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు బాలయ్య ముదిరాజ్ నరేష్ ముదిరాజ్ సుధాకర్ ముదిరాజ్ సంఘం నాయకులు పుల్లయ్య మంద భూమయ్య బిమరి కిష్టయ్య చెక్కల రమేష్ రాగుల బాలనర్సయ్య యూత్ గ్రామ అధ్యక్షుడు రాగుల శ్రీకాంత్ ముదిరాజ్ నాయకులు ఐలయ్య ముదిరాజ్ సత్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *