వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆల్ బ్రాహ్మిణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, వరంగల్(ఆబోప) ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, నృత్య పురస్కార ప్రదానోత్సవ సభ భీమారంలోని అగస్త్య బ్రాహ్మణ భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. మోత్కూరు మనోహర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం విశ్రాంత ఆచార్యులు మాడభూషణం రాజగోపాలచార్య పాల్గొన్నారు. మధుర కవి మోత్కూరు మధుసూదనరావు స్మారకార్థం సాహిత్య కళానిధి అవార్డును ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కార్టూనిస్టు, ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత సీనియర్ మేనేజర్ నెల్లుట్ల రమాదేవికి, సంగీత కళానిధి అవార్డును మోత్కూరు అరుణాదేవి స్మారకార్థం ప్రముఖ సంగీత విద్వాంసుడు, మ్యూజిక్ డైరెక్టర్, ఖమ్మం స్వరసుధ అధ్యక్షుడు కొమర్రాజు మాధవరావుకు, మోత్కూరు పార్దసారధిరావు స్మారకంగా నృత్య కళానిధి అవార్డును ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు ఈటూరి సాయిచరణ్‌కు ప్రదానం చేశారు. ఈ అవార్డుల కింద రూ.5000ల చొప్పున పారితోషికాన్ని డాక్టరు మోత్కూరు మాణిక్యరావు, మోత్కూరు వేంకటరామారావు, మోత్కూరు మధూకర్ రావులు అందించారు. తొలుత పాలకుర్తి మధుసూదనరావు రచించిన చేతన గేయ కావ్య సంపుటిని ముఖ్య అతిథి రాజగోపాలచార్య ఆవిష్కరించారు. చేతన గేయాలు, కవితలు నేటి సమాజ స్దితిగతులకు అద్దం పట్టినట్లు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ చదవవలసినదని లక్ష్మీనరసింహమూర్తి పుస్తక పరిచయం చేశారు. సన్మాన స్వీకర్తలు మాట్లాడుతూ ఆబోప అందించిన ఈ అవార్డులు తమ బాధ్యతను పెంచాయన్నారు. సభలో పాలకుర్తి సుమనస్విని, సుస్మిత, మాధవరావు ఆలపించిన కీర్తనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాలకుర్తి దినకర్, కోశాధికారి చిట్టంపల్లి రవీందర్ రావు, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, ఆచార్య ఎం.ధర్మేందర్ రావు, జయప్రసాదరావు, విశ్వనాధం, ముసిపట్ల శ్రీనివాసరావు, సుదర్శన్‌రావు, శ్రీకాంత్, వెంకట్, మహిళా సభ్యులు ఇందిర, శ్రీదేవి, రేణుక, సుస్శిత, రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




