ఘనంగా అంబేద్కర్  వర్ధంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌..న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని మైలరం సుబ్రహ్మణ్యo  అన్నారు. కొత్తూరు మండలం గూడూరు గ్రామం లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయుడు కి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్రమణ్యo మాట్లాడుతూ,,,అంటరానితనంపై అలుపెరగని పోరు చేశారాయన. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహనీయుడాయన.సమాజంలోని అన్ని వర్గాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉండాలంటూ రాజ్యాంగాన్ని రూపొందించారాయన. అలాంటి మహనీయుడి వర్ధంతి ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అంబేడ్కర్‌ చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్తయ్య డిప్యూటీ సర్పంచ్ ఉప్పల్ దయానంద గుప్త అంబేద్కర్ సంఘం నాయకులు ఎం బి కుమార్ ఏం రవి మైలరాo ప్రవీణ్ నరేందర్ దయనంద  రమేష్ జంగయ్య పృథ్వీరాజ్  సంపత్ విశాల్ వినోద్ సుదర్శన్ తరుణ్ కర్ణకర్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *