ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి, జూలై 19: మొయినాబాద్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా అల్లి దేవేందర్ మాట్లాడుతూ నిన్నటి నుండి జోరు వర్షం కురుస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికుల మాదిరిగా వేతనాలు పెంచాలని ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని,51జీవో రద్దు చేయాలని,మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ మొయినాబాద్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్,సుధాకర్,మాణిక్యం గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.




