– మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 23: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి శ్రీనగర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని ఎం.డి.గౌస్‌పల్లెలో నిర్మాణం పూర్తయిన కల్వర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ప్రతి కుటుంబానికి వేతనంతో కూడిన పనిని కల్పించడం ద్వారా మౌలిక వసతుల కల్పన, ఉత్పాదకత పెంపు, సుస్థిరమైన ఆస్తుల సృష్టి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా విజయోత్సవానికి నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సహచర మంత్రులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారుల సమష్టి కృషితో ఈ కార్యక్రమం ఘన విజయం సాధిస్తోందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





