గ్రామా గ్రామాన విస్తృతంగా ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 1 : కందుకూరు మండలంలో మంత్రి సబితా రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ చేసిన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సబితా రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఒక్కో గ్రామంలో ఒక్కోరకంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.సబితా రెడ్డి విజయమే ధ్యేయంగా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు.గతంలో వృద్ధులకు, వికలాంగులకు,రైతులకు,దళితులకు, బిసిలకు,మైనార్టీలకు ఇచ్చిన పథకాలు అందాయా లేదా అని క్లుప్తంగా అడిగి తెలుసుకుంటున్నారు.ఒకవేళ ఫలాలు రాకపోతే తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఏర్పాటు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కేసీఆర్ కృషి చేస్తారని ప్రజలకు విడమర్చి తెలుపుతున్నారు.ఒక్కో గ్రామంలో నాయకులతో పాటు కార్యకర్తలు వందల సంఖ్యలో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ బిజెపిల కంటే ముందంజలో ఉన్నారు.జడ్పీటీసీ బొక్క.జంగారెడ్డి,మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్,మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్ రెడ్డి,కాకి దశరథ ముదిరాజ్,డిల్లి శ్రీధర్ ముదిరాజ్,మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు సామ ప్రకాష్ రెడ్డి,మాజీ సర్పంచ్ రావిచెట్టు యాదయ్య,నాయకులు తల్లోజు లక్ష్మణాచారి,దీక్షిత్ రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు పూర్తిస్థాయిలో ప్రచారంలో నిమగ్నమైనారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *