ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 16: కెసిఆర్ పరిపాలన మోసపూరితమైనదాని తెలుసుకొని బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పామేనా బీమ్ భరత్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ప్రజలకు ఏం చేసింది లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి పది సంవత్సరాలు పాలించింది బిఆర్ఎస్ పార్టీ కాని ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ నిరుద్యోగులంతా ఉద్యోగస్తులు అవుతారని ఆశించారు.కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలన్న ఊసే లేదన్నారు.కెసిఆర్ చెప్పిన మాయమాటలకు ప్రజలు పది సంవత్సరాలు మోస పోయి విసుకు చెందారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొయినాబాద్ మండల పరిధిలోని యెంకేపల్లి,జీవన్ గూడ,అప్పోజీగూడ,చందానగర్,గ్రామా లలో గడప,గడపకు ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో బిఆర్ఎస్,బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు,చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీం భరత్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు.యెంకెపల్లి గ్రామం నుండి తెలంగాణ ఉద్యమకారుడు న్యాలట మహిపాల్,బీఆర్ఎస్ నాయకులు తిరుపతి,అనంత రెడ్డి,సాయి రెడ్డి,అజయ్,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.చందానగర్ గ్రామం నుండి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు హిబ్రహీం,ప్రభులింగం,సాయి బాబు,కుమార్,ప్రవీణ్ కుమార్, మోనేష్,శ్రీకాంత్,జాకీర్,రమేష్, ఇమ్రాన్,అక్బర్,శేఖర్,జాహిర్, లక్ష్మయ్య,నర్సిములు,యాదయ్య,తది తరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్మలి మనయ్య,టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచార జోరు




