గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమన్న టిఆర్‌ఎస్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ధర్నాలు, రాస్తారోకోలు
రోడ్లపైనే వంటావార్పుతో నిరసనలు
పొయ్యిలు పెట్టి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెంచిన గ్యాస్‌ ‌ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్‌ ‌ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ధర్నాలకు దిగారు. వంటావార్పులు చేపట్టారు. ఎక్కడిక్కడ రోడ్లపై పొయ్యిలు పెట్టి నిరసనలు తెలిపారు. అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. గ్యాస్‌ ‌స్టవ్‌లపై క్టటెలు పెట్టి మోదీ ప్రభుత్వం పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోదీ డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ నినాదాలు చేశారు. పలు చోట్ల మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 410గా ఉన్న సిలిండర్‌ ‌ధర ఈ రోజు సుమారు మూడు రెట్లు పెరిగి రూ. 1100 దాటడం దురదృష్టకరమన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 1100పైగా గ్యాస్‌ ‌రేటు చేరడం బీజేపీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు.

పేదలకు పెను భారంగా మారిన పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. మహిళలు గ్యాస్‌ ‌సిలిండర్లతో ప్రదర్శన చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని పదవి నుంచి మోదీ దిగిపోవాలని మహిళలు డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ ‌ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ‌మండిపడ్డారు. స్వల్ప కాలంలోనే రెండుసార్లు రూ.50 చొప్పున సిలిండర్‌ ‌ధరను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్ల క్రితం రూ.400 ఉన్న వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఇవాళ రూ.1105కు చేరిందన్నారు.

సిలిండర్‌ ‌ధరల పెంపును నిరసిస్తూ చొప్పదండిలో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఖాళీ సిలిండర్లను రోడ్లపై పెట్టి..క్టటెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పెంచిన సిలిండర్‌ ‌ధరలను నిరసిస్తూ గోదావరిఖని రాజీవ్‌ ‌రహదారిపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ నిరసన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ‌మేయర్‌ అనిల్‌ ‌కుమార్‌ ‌పాల్గొని.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. పెంచిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలను వ్యతిరేకిస్తూ సత్తుపల్లి మండలలోని అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో గ్యాస్‌ ‌సిలిండర్ల తో నిరసన తెలిపారు. రోడ్లపై గ్యాస్‌ ‌సిలిండర్లను ప్రదర్శిస్తూ వంటా, వార్పు కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *