పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: పటాన్ చెరు పట్టణంలోని గౌతంనగర్ కాలనీలోని గణేష్ మండపంలో శ్రీ విఘ్నశ్వర స్వామికి బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రదాన కార్యదర్శి కొల్లోల సుజాత దంపతుల అద్వర్యంలో గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పూజలలో ఆధ్యాత్మికత శోబా భక్తుల అందరు కలిసి ఏకదంతున్ని నామా జపంతో ఆర్తి, అభిషేకాలు అర్చనలు ధూపదీప నైవేద్యాలతో పూజించారు. ఈ కార్యక్రమంలో నాగసాని జగ్దీష్ ముదిరాజ్, రాకేష్, వేణు, చిట్ల కార్తిక్, మనిరజ్, వినోద్ ముదిరాజ్, రూపేష్, చిట్ల కుందన్ ముదిరాజ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


