ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 13: గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిలుగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి విచ్చేసి,బహుజన వీరుడు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలు మారడం వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్యక్రమం
చిలుకానగర్ డివిజన్ నోవా బ్యాంకెట్ హాల్ లో నెర్ధం భాస్కర్ గౌడ్ అద్వర్యంలో జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపిస్తామని చిలుక నగర్ గౌడ సంఘం తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం గౌడ కులస్తులు కల్లు గీచే మోకు ముత్తాదు తో బండారు లక్ష్మారెడ్డి ని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.ఉప్పల్ నియోజకవర్గంలో సమస్యలన్నీ దగ్గరుండి పరిష్కరిస్తానని,గౌడ సోదరులకు ఎల్లమ్మ దేవాలయం, కంఠ మహేశ్వర స్వామి దేవాలయంతో పాటు గౌడ సంక్షేమ భవనం నిర్మాణానికి కృషి చేస్తాననీ హామీ ఇచ్చారు.అర్హులైన గౌడ కులస్తులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని అందేలా కృషి చేస్తాననీ, బి ఎల్ ఆర్ ట్రస్ట్
ద్వారా మీ అందరికీ ఎల్లవేళలా సేవ కార్యక్రమాలు చేసి సహాయసహకారాలు అందిస్తాన న్నారు. ప్రజలు కోరిన అభివృద్ధి జరగాలంటే ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఆత్మీయ సమావేశంలో అధ్యక్షులు గజ్జెల సత్యరాజ్ గౌడ్, సీసా నాగరాజ్ గౌడ్, పల్లె రాజ్ కుమార్ గౌడ్, ఐలి వెంకన్న గౌడ్, అంజయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బుత్కురి నవీన్ గౌడ్, కిషన్ గౌడ్, కొయ్యడ ప్రసాద్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, భాస్కర్ గౌడ్, సాయి గౌడ్, రజినీకాంత్ గౌడ్, హేమలత గౌడ్, గోదా సత్తయ్య గౌడ్, రమేష్ గౌడ్, బాలరాజ్ గౌడ్, రవీందర్ గౌడ్, లింగయ్య గౌడ్, సుదర్శన్ గౌడ్, విష్ణు గౌడ్, ఆనంద్ గౌడ్, యాకయ్య గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



