హైదరాబాద్, పిఐబి, డిసెంబర్ 19 : గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ట్వీట్లో ‘‘గోవా ప్రజలకు ఇవే గోవా విముక్తి దినం తాలూకు అభినందనలు. గోవాకు విముక్తిని సిద్ధింపచేయడం కోసం జరిగినటువంటి ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరి యొక్క మహత్తరమైన తోడ్పాటును మరియు సాహసాన్ని మనం ఈ రోజున స్మరించుకుంటూ ఉంటాం. వారి దార్శనికత్వం ద్వారా మనం ప్రేరణను పొందుతూ, గోవా అభివృద్ధి దిశలో పాటుపడుతూ ఉన్నాం.’’ అని పేర్కొన్నారు.
నాయక్(రిటైర్ డ్) శ్రీ భైరోం సింహ్ మృతి పట్ల ప్రధాని సంతాపం
నాయక్(రిటైర్డ్) భైరోం సింహ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ట్వీట్లో ‘‘నాయక్ (రిటైర్డ్) భైరోం సింహ్ గారిని మన దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలకు గాను స్మరించుకోవడం జరుగుతుంది. మన దేశ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టంలో ఆయన గొప్ప సాహసాన్ని కనబరిచారు. ఆయన ఇక లేరని తెలిసి చాలా దు:ఖించాను. ఈ దు:ఖ ఘడియలో ఆయన కుటుంబానికి కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.



