‌గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఈషా సింగ్‌ ‌టీంకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అభినందనలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 ‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ‌టీం ఈవెంట్‌ (‌షూటింగ్‌)‌లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌ ‌టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు.  ఈషా సింగ్‌ ‌టీం  1759 పాయింట్లతో భారత్‌ ‌కు గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించి, టీమ్‌ ‌స్పిరిట్‌ ‌ను చాటిందని సీఎం అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలుచేస్తున్న పటిష్ట కార్యాచరణే  జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి,  తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *