గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్‌ ‌కామారెడ్డిలో అడుగుపెట్టాలి

కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా?
బీఆర్‌ఎస్‌ ‌పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారింది
కేసీఆర్‌ ‌కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
శ్రీకాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌నాయకులకు సవాలు విసిరారు. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో తెలుస్తుంది అని బీఆర్‌ఎస్‌ ‌నాయకులను గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం నాడు మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్‌, ‌తన అనుచరులతో కలిసి గాంధీ భవన్‌ ‌లో రేవంత్‌ ‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌ ‌రావ్‌ ‌ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. రేవంత్‌ ‌రెడ్డి, మాణిక్‌ ‌రావ్‌ ‌ఠాక్రే పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ ‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగించారు. చంద్రశేఖర్‌ ‌తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు.

వారికి కాంగ్రెస్‌ ‌పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు రేవంత్‌ ‌రెడ్డి.తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారింది అని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ‘‘దేశంలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ అం‌టున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు’’ అని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. వైన్‌ ‌షాపుల టెండర్ల పేరుతో రూ. 2500 కోట్లు కేసీఆర్‌ ‌కొల్లగొట్టారన్నారు. కాంగ్రెస్‌ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మిస్తే… కేసీఆర్‌ 7500 ‌కోట్లకు తెగమ్ముకున్నారు అని విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కడితే.. కేసీఆర్‌ ‌కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్‌ ‌కామారెడ్డిలో అడుగుపెట్టాలి’’ అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

‘‘కాంగ్రెస్‌ ‌హయాంలో పదేళ్లలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాం. కేసీఆర్‌కు సూటిగా సవాల్‌ ‌విసురుతున్న ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగొద్దు…డబుల్‌ ‌బెడ్రూం ఇల్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడగం’’ అని రేవంత్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌నాయకులకు సవాలు విసిరారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్‌ ‌తుంగలో తొక్కారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ ‌మాత్రమే. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌మూడు పార్టీలను ఓడించండి. కాంగ్రెస్‌ను గెలిపించండి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.

రూ.500 లకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ఇస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తాం.26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ ‌పొత్తు ఖాయమైంది కాబట్టే, కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని కేసీఆర్‌ ‌వదిలేసారని రేవంత్‌ ‌రెడ్డి కేసీఆర్‌ ‌ను విమర్శించారు. మునుగోడు లో కమ్యూనిస్టులతో కలిసిన కేసీఆర్‌…‌కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్‌ ‌కు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్‌.. అమిత్‌ ‌షాతో చీకట్లో ఒప్పందం చేసుకొని.. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పంగనామాలు పెట్టాడు అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు లకు సీట్లు ఇవ్వకుండా, ఏకపక్షంగా కేసీఆర్‌ ఎం‌దుకు సీట్లు ప్రకటించారు..? అని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు.

చేవెళ్ల సభ ఏర్పాట్ల పరిశీలన: ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఏర్పాట్లపై పార్టీ నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *