భద్రాచలం,ప్రజాతంత్ర ,డిసెంబర్ 21 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా 1వ తేది ఆదివారం నాడు గోదావరి నదిపై నిర్వహించనున్న తెప్పోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. స్వామివారిని గోదావరి నదిపై విహరింపజేసే హంసవాహనాన్ని సిద్ధం చేసారు.
బుధవారం నాడు దేవస్థానం అధికారులు ఆర్‌డిఓ రత్నకళ్యాణి, తహశిల్దార్ శ్రీనివాస్ యాదవ్, సిఐ నాగరాజురెడ్డి, ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో గోదావరి నదిపై ట్రయల్ రన్ నిర్వహించారు. 1వ తేది నాటికి పూర్తిస్థాయిలో హంస వాహనం సిద్ధం కానుంది. 1వ తేది సాయంత్రం పవిత్ర గోదావరి నదిపై హంస వాహనంపై స్వామివారిని కుర్చుండబెట్టి నదిపై విహరించనున్నారు. ఈ సుందర దృశ్యాన్ని దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలి రానున్నారు.




